అమర్‌నాథ్ యాత్ర మార్గంలో అమెరికన్ మేడ్ స్నైపర్ రైఫిల్

అమర్‌నాథ్ యాత్ర అర్ధాంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. లోయ నుంచి వెంటనే భక్తులు స్వస్థలాలకు వెళ్లిపోవాలని జమ్ముకశ్మీర్‌ డీజీపీ ప్రకటించారు. అటు రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ కూడా ఇవే ఆదేశాలను జారీ చేశారు. అంతేకాదు రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. అయితే ఎందుకు ఇలా చేశారన్న దానిపై ఆర్మీ అధికారులు వివరణ ఇచ్చారు. యాత్ర దారిలో ఉగ్రవాదుల కదలికలను గుర్తించామని..ల్యాండ్‌మైన్లు, ఐఈడీలను స్వాధీనం చేసుకున్నట్లు లెఫ్టినెంట్ కల్నల్ ధిల్లాన్ ప్రకటించారు. మూడు రోజుల క్రితం అమర్‌నాథ్ […]

అమర్‌నాథ్ యాత్ర మార్గంలో అమెరికన్ మేడ్ స్నైపర్ రైఫిల్
Follow us

| Edited By:

Updated on: Aug 03, 2019 | 11:54 AM

అమర్‌నాథ్ యాత్ర అర్ధాంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. లోయ నుంచి వెంటనే భక్తులు స్వస్థలాలకు వెళ్లిపోవాలని జమ్ముకశ్మీర్‌ డీజీపీ ప్రకటించారు. అటు రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ కూడా ఇవే ఆదేశాలను జారీ చేశారు. అంతేకాదు రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. అయితే ఎందుకు ఇలా చేశారన్న దానిపై ఆర్మీ అధికారులు వివరణ ఇచ్చారు. యాత్ర దారిలో ఉగ్రవాదుల కదలికలను గుర్తించామని..ల్యాండ్‌మైన్లు, ఐఈడీలను స్వాధీనం చేసుకున్నట్లు లెఫ్టినెంట్ కల్నల్ ధిల్లాన్ ప్రకటించారు. మూడు రోజుల క్రితం అమర్‌నాథ్ యాత్ర మార్గంలో ఐఈడీలు, ల్యాండ్‌మైన్లు, అమెరికన్ మేడ్ స్నైపర్ రైఫిల్ లభ్యమయ్యాయని తెలిపారు. దీంతో కశ్మీర్‌లో లోయ మొత్తం జల్లెడ పట్టాలని అధికారులను సర్కార్ ఆదేశించింది. ల్యాండ్‌మైన్లను నిర్వీర్యం చేసి.. ఆయుధాలను, ఐఈడీలను స్వాధీనం చేసుకున్నామని.. ఇది పాకిస్థానీ టెర్రరిస్టు గ్రూపులపనేనని ధిల్లాన్ అన్నారు. ఇక బలగాల మోహరింపు భద్రత కోసమే కానీ.. ఎలాంటి చర్యలకు దిగబోయేది లేదన్నారు. అయితే పాకిస్థాన్ చర్యలకు ప్రతిచర్యలు ఉంటాయని తెలిపారు. పాకిస్థాన్ ఇలానే ఉగ్రవాదులను భారత్ మీదకు వదిలితే.. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.