దేనికైనా సిద్ధమంటున్న భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్

Army prepared to deal with any security challenge in J&K says Gen Bipin Rawat, దేనికైనా సిద్ధమంటున్న భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్

పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే.. దేనికైనా రెడీ అంటున్నారు.. భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్‌లో కశ్మీర్ కలిసినందుకు ఇక్కడి ప్రజలు ఆనందంగానే ఉన్నారన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తామన్నారు. మేము కూడా జమ్మూకశ్మీర్ ప్రజలతో స్నేహభావం కోరుకుంటున్నామని తెలిపారు. కాగా.. నియంత్రణ రేఖ వద్ద బలగాలు మోహరించాలనుకోవడం పాక్ ఇష్టమని.. ముందుగా ఏ సైనిక బలగాలైనా అలా చేసుకోవచ్చని అన్నారు. దీని గురించి మనం ఆందోళన చెందాల్సిన పని లేదని పేర్కొన్నారు. కానీ.. పాక్ మితిమీరిన చర్యలు పాల్పడితే కనుగ.. మా చర్యలు తీవ్రంగా ఉంటాయని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆర్మీ పరంగా మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *