జ‌న‌గామ‌ను వీడ‌ని క‌రోనా..జ‌వాన్‌కు పాజిటివ్‌

జ‌న‌గామ జిల్లాను క‌రోనా వీడ‌టం లేదు. తాజాగా జిల్లాకు చెందిన ఓ జ‌వానుకు కూడా వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది.

జ‌న‌గామ‌ను వీడ‌ని క‌రోనా..జ‌వాన్‌కు పాజిటివ్‌
Follow us

|

Updated on: Apr 24, 2020 | 1:56 PM

జ‌న‌గామ జిల్లాను క‌రోనా వీడ‌టం లేదు. ఇటీవ‌లే జ‌న‌గామలో వైర‌స్ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారంద‌రినీ క్వారంటైన్ నుంచి డిశార్చ్ చేసి..హోం క్వారంటైన్‌లో ఉంచారు. ప్ర‌స్తుతం పాజిటివ్ కేసులు లేనందువ‌ల్ల జిల్లాలో కాస్తా ఊర‌ట క‌లిగింది. అయితే, తాజాగా జ‌న‌గామ జిల్లాకు చెందిన ఓ జ‌వానుకు కూడా వైర‌స్ సోకిన‌ట్లు స‌మాచార‌రం. వివ‌రాల్లోకి వెళితే…
జ‌న‌గామ జిల్లాలో ఆర్మీ ఉద్యోగికి క‌రోనా వైర‌స్ సోకింది.  బ‌చ్చ‌న్న‌పేట మండ‌లం బండ నాగారం గ్రామానికి చెందిన ఈ జ‌వాన్‌కు వైర‌స్ ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లుగా స్థానికులు గుర్తించి అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. వెంట‌నే గ్రామానికి చేరుకున్న వైద్యాధికారులు మూడు రోజుల క్రితం ఆర్మీ ఉద్యోగి నుంచి శాంపిల్ తీసుకొని వెళ్లారు. దాని ఫలితం గురువారం వచ్చింది. దీంతో వైద్య సిబ్బంది గ్రామానికి చేరుకొని కరోనా సోకిన వ్యక్తిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, అత‌డి వైర‌స్ ఎలా సోకింద‌నే దానిపై అధికారులు విచార‌ణ చేప‌ట్టారు.
ఇండియ‌న్ ఆర్మీలో పని చేస్తున్న ఇత‌ను(క‌రోనా బాధితుడు) గత కొంత కాలం క్రితమే ఢిల్లీ నుంచి స్వస్థలానికి చేరుకున్నాడు. నెల రోజుల క్రితం కరీంనగర్‌లో పర్యటించిన పది మంది ఇండోనేసియన్లకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. వారు రామగుండానికి వచ్చిన సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలులోనే ఈ జవాను కూడా వచ్చినట్లుగా సమాచారం. అయితే, ఈ పరిణామం జరిగి నెల రోజులుగ‌డిచిపోయింది. ఈ వ్యక్తికి తాజాగా కరోనా లక్షణాలు బయట పడడంతో  అంద‌రిలోనూ మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తోంది. 

ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు