వర్షాలు, వరదల్లో మధ్యప్రదేశ్, హెలీకాఫ్టర్లలో బాధితుల తరలింపు

భారీ వర్షాలు, వరదలతో మధ్యప్రదేశ్ లో జనజీవనం స్తంభించిపోయింది.  నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వేలాది గ్రామాలు నీటి ముంపునకు గురయ్యాయి. మారుమూల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమని తమను..

వర్షాలు, వరదల్లో మధ్యప్రదేశ్, హెలీకాఫ్టర్లలో బాధితుల తరలింపు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 30, 2020 | 1:48 PM

భారీ వర్షాలు, వరదలతో మధ్యప్రదేశ్ లో జనజీవనం స్తంభించిపోయింది.  నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వేలాది గ్రామాలు నీటి ముంపునకు గురయ్యాయి. మారుమూల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమని తమను ఆదుకునేవారికోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్  ఆదేశాలపై వందలాది సహాయక బృందాలు  ఆయా గ్రామాలకు తరలి వెళ్లాయి. పోలీసులు, జాతీయ విపత్తుల సహాయక దళాలు సహాయక  కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. తాజాగా సీహోర్ జిల్లా లోని సామల్ వాడ పల్లె ప్రజలు జల  దిగ్బంధంలో చిక్కుకోగా భారత వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్లు రంగంలోకి దిగాయి. వారిని ప్రత్యేక హెలీకాఫ్టర్ లో జిల్లా ప్రధాన కార్యాలయానికి తరలించి రక్షించారు. అటు- రాష్ట్రంలోని 52 జిల్లాలకు గాను 16 గ్రామాల్లో రెడ్. ఆరెంజ్ అలర్ట్ హెచ్ఛరికలు జారీ చేశారు.

లక్షలాది మందిని పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు.