టెర్రిరిస్టుల రహస్య స్థావరాల గుర్తింపు..

ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారితో యుద్ధం చస్తుంటే.. మన దేశం మాత్రం ఓ వైపు కరోనాతో.. మరోవైపు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో యుద్ధం చేస్తోంది. తాజాగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న క్రమంలో దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారు. ఈ క్రమంలో మన సైన్యం కూడా ఎప్పటికప్పుడు చెక్ పెడుతోంది. తాజాగా శనివారం పుల్వామాలో మరోసారి ఉగ్రవాదుల కలకలం చోటుచేసుకుంది. శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులతో పాటుగా ఉగ్రవాదులకు సహాయంగా పనిచేసే మరోకరు […]

టెర్రిరిస్టుల రహస్య స్థావరాల గుర్తింపు..
Follow us

| Edited By:

Updated on: Apr 25, 2020 | 9:18 PM

ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారితో యుద్ధం చస్తుంటే.. మన దేశం మాత్రం ఓ వైపు కరోనాతో.. మరోవైపు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో యుద్ధం చేస్తోంది. తాజాగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న క్రమంలో దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారు. ఈ క్రమంలో మన సైన్యం కూడా ఎప్పటికప్పుడు చెక్ పెడుతోంది. తాజాగా శనివారం పుల్వామాలో మరోసారి ఉగ్రవాదుల కలకలం చోటుచేసుకుంది. శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులతో పాటుగా ఉగ్రవాదులకు సహాయంగా పనిచేసే మరోకరు కూడా హతమయ్యారు.

ఈ క్రమంలో అవంతిపొర ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని గుర్తించాయి. దక్షిణ కశ్మీర్‌లోని అవంతపొర ప్రాంతంలో నేలమాళిగలో ఉన్న ఈ స్థావరాలను గుర్తించారు. 10×10 అడుగులు ఉన్న ఈ అండర్‌ గ్రౌండ్‌ ఉగ్ర వాదుల స్థావరం గురించి అధికారులకు సమాచారం ఇచ్చారు. అంతేకాదు ఇక్కడ పలు ఆయుధాలను, మందు గుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. గత మార్చి నెలలో కూడా జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు ఇదే ప్రాంతంలో ఓ ఉగ్రవాద స్థావరాన్ని గుర్తంచి ధ్వంసం చేశారు.