తెల్ల జెండాలతో రండి… మీ వారి శవాలను తీసుకెళ్లండి.. పాక్‌కు సూచన

గత కొద్ది రోజులుగా కశ్మీర్‌ లోయలో హై టెన్షన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే సరిహద్దుల్లో వారం రోజులుగా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. భారత ఆర్మీ సహనాన్ని పరీక్షించింది. కుప్వారా జిల్లా కీరన్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద చొరబడడానికి ప్రయత్నించిన ఐదు నుంచి ఏడుగురు వ్యక్తుల్ని భారత సైనికులు హతమార్చారు. వారంతా పాక్‌ సైన్యానికి చెందిన స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌ (ఎస్‌ఎస్‌జీ) కమాండోలుగానీ, ఉగ్రవాదులుగానీ కావచ్చని భావిస్తున్నారు. వారు చనిపోయి దాదాపు 36 గంటలు […]

తెల్ల జెండాలతో రండి... మీ వారి శవాలను తీసుకెళ్లండి.. పాక్‌కు సూచన
Follow us

| Edited By:

Updated on: Aug 04, 2019 | 11:28 AM

గత కొద్ది రోజులుగా కశ్మీర్‌ లోయలో హై టెన్షన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే సరిహద్దుల్లో వారం రోజులుగా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. భారత ఆర్మీ సహనాన్ని పరీక్షించింది. కుప్వారా జిల్లా కీరన్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద చొరబడడానికి ప్రయత్నించిన ఐదు నుంచి ఏడుగురు వ్యక్తుల్ని భారత సైనికులు హతమార్చారు. వారంతా పాక్‌ సైన్యానికి చెందిన స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌ (ఎస్‌ఎస్‌జీ) కమాండోలుగానీ, ఉగ్రవాదులుగానీ కావచ్చని భావిస్తున్నారు. వారు చనిపోయి దాదాపు 36 గంటలు దాటినప్పటికీ.. వారి మృతదేహాలు పీఓకే వద్ద అలానే పడి ఉన్నాయి. దీంతో భారత సైన్యం పాకిస్థాన్‌కు వారి మృతదేహాలను తీసుకెళ్లేందుకు అవకాశం ఇచ్చింది. తెల్ల జెండాలు పట్టుకుని వచ్చి.. మీ వాళ్ల మృతదేహాలు తీసుకెళ్లి.. అంతిమ సంస్కారాలు నిర్వహించుకోవాలని తెలిపింది. అయితే దీనిపై పాక్‌ ఇంకా స్పందించాల్సి ఉంది.