తమిళ ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్‌కు రెడీ.!

తెలుగులో హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాని హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీ వెర్షన్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది. కానీ తమిళ వెర్షన్ ‘ఆదిత్య వర్మ’ మాత్రం అలా కాలేదు. మొదట బాల దర్శకత్వం‌లో మొదలైన ఈ చిత్రం 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని  ఔట్ ఫుట్ సరిగ్గా రాకపోవడంతో అర్ధాంతరంగా ఆగిపోయింది.

ఆ తర్వాత బాల ప్లేస్‌లో గిరీశయ్య అనే నూతన దర్శకుడిని తీసుకుని.. హీరోయిన్‌గా హిందీ అమ్మాయి బాణీత సంధును ఎంపిక చేసింది చిత్ర యూనిట్. ఇలా పలు మార్పుల తర్వాత కొత్తగా మొదలైన సినిమా ఈసారి ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది. 50 రోజులలో షూటింగ్ పూర్తి చేసి.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోందట. ఈసారి సినిమా బాగా వచ్చిందని చిత్ర యూనిట్ సైతం నమ్మకంతో ఉన్నారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *