‘అర్జున్ రెడ్డి’ దర్శకుడి ఇంట విషాదం.. సినీ ప్రముఖుల పరామర్శ!

Sandeep Reddy Vang's Mother Passes Away, ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడి ఇంట విషాదం.. సినీ ప్రముఖుల పరామర్శ!

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ టాక్ అఫ్ ది టౌన్‌గా నిలిచిన దర్శకుడు సందీప్ రెడ్డి ఇంట వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. అయన తల్లి సుజాత వంగా గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. వరంగల్‌ వెంకటయ్య కాలనీలోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఇక ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.

కాగా ‘అర్జున్ రెడ్డి’తో తెలుగునాట సంచలన సృష్టించిన ఈయన.. అదే సినిమాను బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’ పేరుతో తెరకెక్కించి ఘనవిజయం సాధించాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *