Diego Maradona dies: క్యాస్ట్రో, మారడోనా మధ్య అల్లుకున్న స్నేహబంధం, మరణంలోనూ ఒక్కటైన విశేషం!

ఒకరేమో సాకర్‌ దిగ్గజం, మరొకరు రాజకీయ దురంధరుడు. ఒకరు ఆశేష క్రీడాభిమానులను సొంతం చేసుకున్న ఫుట్‌బాల్‌ మాంత్రికుడు, మరొకరు జన హృదయాలలో చిరస్థానం ఏర్పరచుకున్న జనరంజక పాలకుడు..

Diego Maradona dies: క్యాస్ట్రో, మారడోనా మధ్య అల్లుకున్న స్నేహబంధం, మరణంలోనూ ఒక్కటైన విశేషం!
Follow us

|

Updated on: Nov 26, 2020 | 3:49 PM

ఒకరేమో సాకర్‌ దిగ్గజం, మరొకరు రాజకీయ దురంధరుడు. ఒకరు ఆశేష క్రీడాభిమానులను సొంతం చేసుకున్న ఫుట్‌బాల్‌ మాంత్రికుడు, మరొకరు జన హృదయాలలో చిరస్థానం ఏర్పరచుకున్న జనరంజక పాలకుడు.. చెట్టుమీద కాయను, సముద్రంలో ఉప్పును కలిపినట్టే ఇద్దరిని కలిపింది.. ఇద్దరు ప్రాణ స్నేహితులయ్యారు.. ఇద్దరి మధ్య గట్టి అనుబంధం ఏర్పడింది.. ఆ ఇద్దరిలో ఒకరు నిన్న దిగంతాలకు వెళ్లిపోయిన డీగో మారడోనా.. ఇంకొకాయన క్యూబాకు సుదీర్ఘకాలం అధినేతగా ఉన్న ఫిడెల్‌ క్యాస్ట్రో.. విధిని వీరిద్దరు నమ్ముతారో లేదో తెలియదు కానీ వారిద్దరి మరణంలోనూ ఓ సామీప్యం ఉంచింది.. నిన్న మారడోనా కన్నుమూయగా, క్యాస్ట్రో నాలుగేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున మరణించారు.. క్యాస్ట్రో అంటే డీగోకు ఎంతో గౌరవం.. అంతకు మించి ప్రాణం.. క్యాస్ట్రో చనిపోయినప్పుడు మారడోనా కన్నీరుమున్నీరయ్యాడు.. తన తండ్రి మృతి తర్వాత అంతగా బాధపడింది, ఆవేదన చెందింది ఇప్పుడేనని అన్నాడు కూడా! అసలు ఈ ఇద్దరి కలయికే విచిత్రంగా జరిగింది.. 1986లో ఫిఫా ప్రపంచకప్‌ను అర్జెంటీనా గెల్చుకుంది.. ఆ గెలుపులో మారడోనా కీలకపాత్ర పోషించాడు.. అప్పుడే తన అభిమాన నేత ఫిడెన్‌ క్యాస్ట్రోను మొదటిసారి కలిశాడు మారడోనా. ఆ తర్వాత వారిద్దరు కలుసుకునే అవకాశం రాలేదు. అయితే ఓ విపత్కరమైన పరిస్థితి మళ్లీ వారిద్దరిని కలిపింది.. ఫుట్‌బాల్‌లో రారాజుగా ఉన్న కాలంలోనే మారడోనాకు మత్తు పదర్థాలు తీసుకునే పాడు అలవాటు మొదలయ్యింది.. 1991లో డోపింగ్‌ పరీక్షలో పట్టుబడ్డాడు కూడా.. ఆ కారణంగా 15 నెలల పాటు ఫుట్‌బాల్‌కు దూరం కావలసి వచ్చింది.. అయినా ఆ దుర్వ్యసనాన్ని మానలేకపోయాడు.. ఓ రకంగా మాదకద్రవ్యాలకు బానిసయ్యాడు.. ఆరోగ్యం పూర్తిగా పాడయ్యింది.. ఒకానొకదశలో మారడోనా బతకడం కష్టమనే అనుకున్నారు.. అంతగా తన ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నాడు మారడోనా.. అలాంటి సమయంలో క్యాస్ట్రో అండగా నిలిచాడు. మారడోనాకు మెరుగైన చికిత్సను అందించాడు. అప్పట్లో అర్జెంటీనాలో చికిత్స పొందడానికి అవకాశాలు తక్కువే.. అలాంటి విపత్కర సమయంలో క్యాస్ట్రో తన దేశంలోనే మారడోనాకు చికిత్సకు సహకరించారు. చికిత్స పొందే సమయంలో వీరిద్దరి మధ్య స్నేహబంధం బలపడింది.. ఇద్దరూ కలిసి మార్నింగ్‌వాక్‌కు వెళ్లేవారు.. ఆ టైమ్‌లో వర్తమాన రాజకీయాల గురించి, సమాజపు పోకడల గురించి మాట్లాడుకునేవారు. రాజకీయ, క్రీడా అంశాలు కూడా చర్చకు వచ్చేవి.. క్యాస్ట్రో విజనరీ చూసి మారడోనా ముగ్ధుడయ్యాడు.. ప్రజా శ్రేయస్సు కోసం ఆయన పడుతున్న తపన డీగోకు చాలా బాగా నచ్చింది.. ఆ నిమిషం నుంచి క్యాస్ట్రో అంటే అభిమానం పదింతలు అయ్యింది.. తన ఒంటిమీద పచ్చబొట్టు వేసుకునేలా చేసింది.. యానడెపా కుడిచేతిపై చే గువేరా పచ్చబొట్టు ఉంటే, ఎడమకాలి మీద ఫిడెల్‌ క్యాస్ట్రో టాటూ ఉంటుంది..