మీరు తినేది నిజమైన మటనేనా?

మీరు తినే మటన్ మంచిదేనా! అదేంటని ఆశ్చర్యపోతున్నారా? చికెన్ కన్నా మటన్ తింటే మంచిదే కదా అనుకుంటున్నారా! అవును మంచి మటన్ మంచిదే. ఏంటి కన్ఫ్యూజ్‌ అయ్యారా! ప్రస్తుతం నెల్లూరులో యవ్వారం అలానే ఉంది. ఇప్పుడు మార్కెట్లో దొరికే మటన్.. మేలు కన్నా కీడు ఎక్కువ చేస్తుంది. మనం తినేది పొట్టేళ్లు, మేక, గొర్రె మాంసమైతే పర్వాలేదు. అదే గేదె, ఇతర జంతువుల మాంసమైతే.. .అమ్మో వింటూనే వికారం వస్తుంది కదూ. నెల్లూరు నగరంలో కొందరు హోటల్స్ సిబ్బంది […]

మీరు తినేది నిజమైన మటనేనా?
Follow us

| Edited By:

Updated on: Dec 30, 2019 | 8:10 AM

మీరు తినే మటన్ మంచిదేనా! అదేంటని ఆశ్చర్యపోతున్నారా? చికెన్ కన్నా మటన్ తింటే మంచిదే కదా అనుకుంటున్నారా! అవును మంచి మటన్ మంచిదే. ఏంటి కన్ఫ్యూజ్‌ అయ్యారా! ప్రస్తుతం నెల్లూరులో యవ్వారం అలానే ఉంది. ఇప్పుడు మార్కెట్లో దొరికే మటన్.. మేలు కన్నా కీడు ఎక్కువ చేస్తుంది. మనం తినేది పొట్టేళ్లు, మేక, గొర్రె మాంసమైతే పర్వాలేదు. అదే గేదె, ఇతర జంతువుల మాంసమైతే.. .అమ్మో వింటూనే వికారం వస్తుంది కదూ. నెల్లూరు నగరంలో కొందరు హోటల్స్ సిబ్బంది ధనార్జనే లాభంగా.. పొట్టేళ్ల స్థానంలో.. గెదే మాంసం విక్రయిస్తూ హెల్త్‌ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. నాన్‌వెజ్‌ ప్రియులు పెరిగిపోతుండడంతో.. శుభ్రమైన మటన్‌ కాకుండా కేటుగాళ్లు ఇష్టారాజ్యంగా అమ్మకాలు సాగిస్తున్నారు.

సాధారణంగా సండే రోజున ముక్క లేనిదే ముద్ద దిగదని మాంసం ప్రియులు చెబుతుంటారు. ఇక పండుగలు, శుభకార్యాలు, విందులకు చెప్పేదేముంది. నాన్‌ వెజ్‌ కంపల్సరీ అయిపోయింది. మేక, గొర్రె.. ఖరీదైనా సరే కొనేస్తున్నారు. అయితే హోటళ్లు, షాపుల్లో దొరికే మాంసం నిజంగా పొటేళ్లు, మేకదా అనేది మాత్రం పరిశీలించడం లేదు. ఇదే అదనుగా హోల్‌సేల్‌ వ్యాపారులు కూడా రెచ్చిపోతున్నారు. హోటళ్లు, ఫంక్షన్లకు. ఇతర రెస్టారెంట్లకు మటన్ ప్లేస్‌లో గేదె మాంసాన్ని సరఫరా చేస్తున్నట్టు తనిఖీల్లో వెల్లడైంది.

నెల్లూరు నగరశివారులోని బొడిగాని తోట ప్రాంతంలో తనిఖీలు చేపట్టిన హెల్త్‌ అధికారులు భయంకరమైన నిజాలు వెలుగు చూశారు. టన్నులకొద్దీ గేదె మాంసం వ్యర్థాలతోపాటు కుళ్లిపోయిన పొట్టేళ్లు, ఇతర జంతువుల చర్మాలను అధికారులు గుర్తించారు. దీంతోపాటు నగరంలో మటన్‌ గోదాములపై కూడా దాడి చేసి కుళ్లిన వ్యర్థాలను సీజ్‌ చేశారు. ఈ వార్త విన్న నెల్లూరు వాసులు మటన్‌ బిర్యానీ అంటేనే భయపడిపోతున్నారు. అయ్యో… ఇన్నాళ్లు హోటళ్లో తిన్నది గేదె మాంసమా..? పొటెళ్లది కాదా అని హడలిపోతున్నారట.

మటన్‌ కబేళాలు, హోటళ్లు, ఇతర ప్రాంతాల్లోకి గేదె వ్యర్థాలు, మటన్‌ ఎలా వచ్చాయని అధికారులు మటన్ వ్యాపారులను ఆరా తీశారు. గేదె మాంసాన్ని మటన్‌లో కలిపి నగరంలో ఏయే ప్రాంతంకు సరఫరా చేస్తున్నారో కనుక్కొని.. ఆయా హోటళ్లను సీజ్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై హెల్త్‌ అధికారులు పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించారు. అయితే ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న మటన్‌ మాఫియా కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
T20 వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్..ఆ స్థార్ఆటగాళ్ల స్థానాలకు ఎసరు
కాంకేర్ ఎన్‌కౌంటర్‌కు నేతృత్వం వహించింది మన తెలుగోడే..!
కాంకేర్ ఎన్‌కౌంటర్‌కు నేతృత్వం వహించింది మన తెలుగోడే..!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!