మీరు జంక్ ఫుడ్ తింటున్నారా..? అయితే జాగ్రత్త..!

జంక్ ఫుడ్ తింటే లావువుతారని.. లేక కొవ్వు పేరుకుపోతుందని మాత్రమే తెలుసు. కానీ.. మీకు తెలుసా..? జంక్ ఫుడ్ తినడం వల్ల అది మీ కణాలపై దాడి చేస్తుందని.. ఇల్లినాయిస్ యూనివర్శిటీకి చెందిన వారు రీసెర్చ్ చేశారు. జంక్ ఫుడ్ తింటే అది బాడీపైనే రియాక్ట్ చూపిస్తుందా..? లేక కణాలపై కూడానా..? అని కొత్త పరిశోధనలు చేశారు. కొంచెం కాలం పాటు రోజూ బర్గర్స్, పిజ్జాలు మరియు సాండివిచ్ లు తినేవారిపై రీసెర్చ్ చేయగా అవి తినడం […]

మీరు జంక్ ఫుడ్ తింటున్నారా..? అయితే జాగ్రత్త..!
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:06 PM

జంక్ ఫుడ్ తింటే లావువుతారని.. లేక కొవ్వు పేరుకుపోతుందని మాత్రమే తెలుసు. కానీ.. మీకు తెలుసా..? జంక్ ఫుడ్ తినడం వల్ల అది మీ కణాలపై దాడి చేస్తుందని.. ఇల్లినాయిస్ యూనివర్శిటీకి చెందిన వారు రీసెర్చ్ చేశారు. జంక్ ఫుడ్ తింటే అది బాడీపైనే రియాక్ట్ చూపిస్తుందా..? లేక కణాలపై కూడానా..? అని కొత్త పరిశోధనలు చేశారు.

కొంచెం కాలం పాటు రోజూ బర్గర్స్, పిజ్జాలు మరియు సాండివిచ్ లు తినేవారిపై రీసెర్చ్ చేయగా అవి తినడం వల్ల కణాల్లోని ధనులపై ఒత్తిడిని ప్రేరేపించాయట. దాని వల్ల అవి వేగంగా పనిచేయడం మొదలుపెట్టాయట. ఇవి క్రమేణా గుండెపోటుకు దారితీస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

ఈ ధమనులు చెడు కొలెస్ట్రాల్ ను విడుదల చేస్తాయట. ఎల్డీఎల్, ఆక్సిడైజ్డ్ ఎల్డీఎల్ అనే నష్టపరిచే రసాయనాలు ఉత్పత్తి చేస్తాయని తెలిపారు. ఎథెరోస్క్లెరోసిస్ అని పిలిచే ధమనులు ఒత్తిడి కారణంగా మందంగా మారడంతో ఇది హార్ట్ స్ట్రోక్‌కి దారి తీస్తుందని డాక్టర్ అయోయ్ తెలిపారు.

బాల్టిమోర్లో ఒక బయోపిజికల్ సొసైటీ సమావేశంలో సమర్పించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. చిన్న కొవ్వు అణువు లిపోప్రోటీన్ల ద్వారా ఇంధనంగా మారి రక్త ప్రవాహంలో తిరుగుతుంది. ఎల్డీఎల్‌ల అధిక పరిమాణంలో చేరడంతో ధమనులు ఒత్తిడికి ప్రధాన కారకం అవుతుంది. ఇది ఆక్సిడైజ్డ్ ఎల్డీఎల్ గా మారి గుండె, మెదడుకు వెళ్లే రక్తం సరఫరాను అడ్డుకుంటుంది. దీని వల్ల అనేక రకమైన జబ్బులకు మనిషి గురవడం జరుగుతుందని పరిశోధకులు తెలిపారు.

బర్గర్లు, పిజ్జాలు, బిస్కెట్లు, కేకులు తినడం వల్ల మీరు కొన్ని సంవత్సరాలు మాత్రమే జీవించగులుగుతారని తెలిపారు. గత నెలలో సుమారుగా 45,000 మంది మధ్య వయస్సు వారు గుండె జబ్బులు, క్యాన్సర్ మరియు ఇతర అనారోగ్యాలకు గురయ్యారని పేర్కొన్నారు.