రోజూ.. ఇడ్లీ, వడ, దోశ తింటున్నారా..? అయితే.. మీకో షాకింగ్ వార్త..!!

రోజూ మీరు ఉదయాన్నే.. బ్రేక్‌ఫాస్ట్‌గా.. ఇడ్లీ, వడ, దోశ, చపాతి, బోండాలు తింటున్నారా..! అయితే.. మీ ఖాతాలో.. మరిన్ని రోగాల సంఖ్య కౌంట్ చేసుకున్నట్టే..! ఏంటి షాక్‌ అవుతున్నారా.. నిజమేనండి.. ప్రతీ రోజూ.. ఇలాంటి అల్పాహారాలు లాగించడం వల్ల వివిధ రోగాల భారిన పడటం ఖాయమంటున్నారు నిపుణులు. చాలా మంది బరువు తగ్గడానికి.. అన్నాన్ని స్కిప్‌ చేసి.. బ్రేక్‌ఫాస్ట్‌లతో.. కాఫీ, టీలతో కడుపు నింపేసుకుంటారు. కానీ.. వీటి వల్ల జరిగే.. వాటిని తెలుసుకుంటే మాత్రం నిజంగా షాక్ […]

రోజూ.. ఇడ్లీ, వడ, దోశ తింటున్నారా..? అయితే.. మీకో షాకింగ్ వార్త..!!
Follow us

| Edited By:

Updated on: Jan 18, 2020 | 12:51 PM

రోజూ మీరు ఉదయాన్నే.. బ్రేక్‌ఫాస్ట్‌గా.. ఇడ్లీ, వడ, దోశ, చపాతి, బోండాలు తింటున్నారా..! అయితే.. మీ ఖాతాలో.. మరిన్ని రోగాల సంఖ్య కౌంట్ చేసుకున్నట్టే..! ఏంటి షాక్‌ అవుతున్నారా.. నిజమేనండి.. ప్రతీ రోజూ.. ఇలాంటి అల్పాహారాలు లాగించడం వల్ల వివిధ రోగాల భారిన పడటం ఖాయమంటున్నారు నిపుణులు.

చాలా మంది బరువు తగ్గడానికి.. అన్నాన్ని స్కిప్‌ చేసి.. బ్రేక్‌ఫాస్ట్‌లతో.. కాఫీ, టీలతో కడుపు నింపేసుకుంటారు. కానీ.. వీటి వల్ల జరిగే.. వాటిని తెలుసుకుంటే మాత్రం నిజంగా షాక్ అవ్వాల్సిందే. మరి ఆ కారణాంలేంటో.. తెలుసుకుందామా..!

1. రోజూ.. ఇడ్లీ, వడ, దోశ లాంటి టిఫిన్స్ తినడం వల్ల మీ జిర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది.

2. అయితే.. మిగతా టిఫిన్స్‌లలో కన్నా.. ఇడ్లీ మంచిదే కానీ.. ఇడ్లీతో పాటు.. సాంబార్, అల్లం చట్నీ, కారంపొడి, నెయ్యి ఇలా అన్నింటి వల్ల కడుపులో ఎసిడిటీ పెరిగిపోతుంది.

3. ప్రతీ రోజూ.. ఇలాంటి వివిధ రకాలైన టిఫిన్స్ తినడం వల్ల పేగులు తన శక్తిని కోల్పోతాయి. తద్వారా.. తిన్న ఆహారం.. జీర్ణమవడానికి చాలా సమయం పడుతుంది.

4. అంతేకాకుండా.. కీళ్ల నొప్పులు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.

5. రోజూ.. ఇవే టిఫిన్స్‌ తింటే కనుక.. బీపీ, షుగర్ వంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదముంది.

6. ఇప్పుడు బటర్ ఇడ్లీ.. చీజ్ దోశలు వంటి ఐటమ్స్ చాలానే వస్తున్నాయి. వాటి వల్ల శరీరానికి మరింత హాని కలుగుతుంది తప్ప మంచివేం కాదు.

మరి.. మార్నింగ్ ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారా..! ఆగండి.. ఉదయం పెరుగన్నం లేక సద్దన్నం, పండ్లు కానీ.. మొలకెత్తిన గింజలు, బాదం, జీడిపప్పు లాంటివి తీసుకోవడం చాలా మంచిది. ఉదయాన్నే జీర్ణవ్యవస్థకు.. హాని కలిగించే.. మంట తెప్పించే ఆహారాలు తీసుకోకూడదు. అలాగే.. ఉదయం హెవీ బ్రేక్ ఫాస్ట్‌ చేయాలి. ఇడ్లీ.. శరీరానికి చాలా మంచి చేస్తుంది. అయితే.. వివిధ రకాల చెట్నీలతో కాకుండా.. ఏదో ఒకటి తినడం మంచిది. వారానికి రెండు, మూడు సార్లు మాత్రమే.. ఇడ్లీ, వడ, దోశ, బోండాలు, పూరీలు వంటి టిఫిన్స్ చేయవచ్చు.