డేటింగ్‌లో పవన్ హీరోయిన్? హీరో ఎవరంటే.?

Is Kriti Kharbanda Dating Pulkit Samrat, డేటింగ్‌లో పవన్ హీరోయిన్? హీరో ఎవరంటే.?

‘బోణి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ కస్తూరి కృతి కర్బందా.. పవన్ కళ్యాణ్ ‘తీన్‌మార్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్‌‌‌‌తో డేటింగ్‌లో ఉన్నారని బీ-టౌన్‌లో వార్తలు వస్తున్నాయి. గతేడాది రిలీజైన ‘వీరే కి వెడ్డింగ్’ చిత్రంలో కలిసి నటించిన ఈ జంట ఆరు నెలలుగా డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ ‘పాగల్ పంటీ’ చిత్రంలో నటిస్తున్నారు.

కృతి కోసం దక్షిణాది వంటకాలను తినడానికి కూడా ఇష్టపడుతున్నాడట పులకిత్.. అంతేకాకుండా షూటింగ్ సమయంలో బ్రేక్ దొరికినప్పుడల్లా కృతికి తరచూ పువ్వులు, చాకలెట్లు పంపిస్తున్నాడని బాలీవుడ్‌లో వినికిడి. అయితే దీనికి సంబంధించి ఈ జంట మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరోవైపు పులకిత్ సామ్రాట్‌కు శ్వేతా రోహిరాతో 2015లో వివాహమయ్యింది. ఆ తర్వాత 2016లో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తరుణంలో హీరోయిన్ యామీ గౌతమ్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ కూడా వినిపించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *