Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

వైరల్‌గా మారిన మహిళా ఎంపీ ఫొటో షూట్

అతి పిన్న వయసులో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం ఈ నెల 17న జరగనున్న విషయం తెలిసిందే. తన చిన్నప్పటి స్నేహితుడు శివప్రసాద్‌ను ఆమె మనువాడనున్నారు. పెళ్లికి సమయం దగ్గర పడుతుండడంతో ప్రీ వెడ్డింగ్ వీడియోను తీసుకున్నారు ఈ జంట. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది.

కాగా మాజీ ఎమ్మెల్యే గొట్టేడి దేముడు కుమార్తె అయిన మాధవి.. మొదట ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి.. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌పై రెండున్నల లక్షల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు. మరోవైపు గొలుగొండ మండలం కేడీ పేట గ్రామానికి చెందిన శివప్రసాద్‌ బీటెక్, ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం ఓ కాలేజ్‌ కరస్పాండెట్‌గా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా.. పెద్దల అంగీకారంతో ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. వీరిద్దరి వివాహం మాధవి స్వగ్రామం శరభన్నపాలెంలో జరగనుంది. వివాహానంతరం ప్రముఖుల కోసం విశాఖ సమీపంలోని రుషికిండ వద్ద ఓ రిసార్ట్స్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.