Breaking News
  • అమరావతి : మోటార్ వాహనాల నిబంధనల ఉల్లంఘన పై జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. భారీగా వాహన జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. బైక్ నుండి 7 సిటర్ కార్ల వరకు ఒక విధమైన జరిమానా . ఇతర వాహనాలకు మరింత అధిక జరిమానాలు.
  • విజయవాడ: ఇంద్రకీలాద్రి కి చేరుకున్న సీఎం జగన్. ఘాట్ రోడ్ మార్గంలో వచ్చిన సీఎం . సీఎం జగన్ కు స్వాగతం పలికిన ఆలయ అర్చకులు ,జిల్లా ప్రజా ప్రతినిధులు ,కలెక్టర్ ,సిపి [ సాంప్రదాయ వస్త్ర ధారణ పంచెకట్టు లో సీఎం జగన్. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్.
  • భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశం. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలి. నగరంలోని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు పడ్డాయి. మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశముంది. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-సీఎం కేసీఆర్‌.
  • హైదరాబాద్‌: వీడిన కూకట్‌పల్లి కిడ్నాప్‌ మిస్టరీ. 24 గంటల్లో కిడ్నాప్‌ కేసు ఛేదించిన పోలీసులు. రహీంను ఆటోలో కిడ్నాప్‌ చేసిన ఇద్దరు దుండగులు. రహీంను పఠాన్‌చెరు తీసుకెళ్లిన కిడ్నాపర్లు. తల్లి రేష్మకు ఫోన్‌ చేసి రూ.మూడు లక్షలు డిమాండ్‌. భయంతో రూ.10 వేలు ట్రాన్సఫర్‌ చేసిన తల్లి. మొబైల్‌ లొకేషన్‌ ఆధారంగా కిడ్నాపర్ల గుర్తింపు. ప్రధాన నిందితుడు సలీంను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పరారీలో మరో నిందితుడు లక్కీ. లక్కీ కోసం గాలిస్తున్న పోలీసులు.
  • విజయవాడ: ఇంద్రకీలాద్రికి పొంచి ఉన్న ముప్పు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని సమాచారం. భారీ వర్షాలకు 4 అంగుళాలు బీటలు వారిన కొండ. అప్రమత్తమైన ఇంజినీరింగ్‌ అధికారులు. ఈవో సురేష్‌బాబుకు సమాచారమిచ్చిన అధికారులు.
  • చిత్తూరు: చిత్తూరులో భారీ ఎత్తునపట్టుబడిన ఎర్రచందనం. ఐదు కార్లలో రెండు కోట్ల విలువైన రెండున్నర టన్నుల ఎర్రచందనం పట్టి వేత. వాహన తనిఖీల్లో పట్టుబడిన ఎర్రచందనం. 11మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మరో పదిమంది స్మగ్లర్ల పరారీ.. కార్లు, ఆటోలు, పాల వానలు లో ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్లు. ఈ మధ్యకాలంలో ఇంత భారీ ఎత్తున ఎర్రచందనం పట్టుబడటం ఇదే మొదటిసారి.

దసర పండుగకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు

దసర పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఏపీఆర్టీసీ 1,850 ప్రత్యేక సర్వీసులను నడపనుంది. శుక్రవారం నుంచి ఈ నెల 26 వరకు ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ప్రత్యేక బస్సులు...

Dussehra Special Bus, దసర పండుగకు ఆర్టీసీ స్పెషల్ బస్సులు

Dussehra Special Bus : దసర పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఏపీఆర్టీసీ 1,850 ప్రత్యేక సర్వీసులను నడపనుంది. శుక్రవారం నుంచి ఈ నెల 26 వరకు ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ప్రత్యేక బస్సులు ఆయా రూట్లలో తిరగనున్నాయి. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు, కర్ణాటకకు కలిపి 5,950 రెగ్యులర్‌ సర్వీసులను తిప్పుతోంది.

వీటికి అదనంగా 1,850 ప్రత్యేక బస్సులను ప్రారంభించనుంది. సాధారణంగా ఏటా దసరా పండుగకు 2,500కు పైగా ప్రత్యేక బస్సుల్ని ఆర్టీసీ నడిపేది. తెలంగాణతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదరకపోవడంతో ఈ దఫా ప్రత్యేక బస్సుల సంఖ్యను కొంత తగ్గించింది.

ఏపీఎస్‌ఆర్టీసీ జిల్లాలవారీగా నడిపే ప్రత్యేక బస్సుల వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం–66, విశాఖపట్నం–128, తూర్పుగోదావరి–342, పశి్చమగోదావరి–40, కృష్ణా–176, గుంటూరు–50, ప్రకాశం–68, నెల్లూరు–156, చిత్తూరు–252, కర్నూలు–254, కడప–90, అనంతపురం–228. అయితే ఆర్టీసీకి పోటీగా ప్రైవేటు బస్సులు జోరుగా నడుపుతున్నారు.

Related Tags