తెలంగాణ నుంచి ఏపీ వెళ్లే ప్రయాణీకులకు గుడ్ న్యూస్..

అంతర్రాష్ట్ర సర్వీసులపై టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీల మధ్య చర్చలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దసరా పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రయాణీకుల సౌలభ్యం కోసం..

  • Ravi Kiran
  • Publish Date - 2:55 pm, Sat, 24 October 20

Interstate Services: అంతర్రాష్ట్ర సర్వీసులపై టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీల మధ్య చర్చలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దసరా పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రయాణీకుల సౌలభ్యం కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టింది. రెండు రాష్ట్రాల సరిహద్దుల దగ్గర ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ఉంచుతామని ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. పంచలింగాల చెక్‌పోస్ట్, గరికపాటి చెక్‌పోస్ట్, వాడపల్లి, పైలాన్, జీలుగుమిల్లి, కల్లుగూడెం చెక్‌పోస్ట్‌ల వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఉంటాయన్నారు.

సరిహద్దుల నుంచి ప్రయాణీకులను తమ ఊర్లకు చేర్చనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జూన్ 18వ తేదీ నుంచి టీఎస్ఆర్టీసీతో చర్చలు జరుపుతున్నప్పటికీ ఇంకా ఒప్పందంపై స్పష్టం రాలేదన్న ఆయన.. దసరా పండుగ అనంతరం మంగళవారం నాడు ఒప్పందం ఫైనల్ అయ్యే అవకాశం ఉందన్నారు. టీఎస్ఆర్టీసీకి వరుసగా సెలవులు రావడం వల్ల అగ్రిమెంట్ చేసుకోవడానికి కుదరలేదని మంత్రి వివరించారు. ఏపీఎస్ఆర్టీసీ లాభనష్టాలను చూడట్లేదని.. ప్రజలు ఇబ్బంది పడకూడదనే తమ ఉద్దేశమని మంత్రి పేర్ని నాని తెలిపారు.

Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు..