APSRTC Special Bus: మహిళల కోసం ఏపీఎస్‌ ఆర్టీసీ సరికొత్త నిర్ణయం.. శుక్రవారం నుంచే ప్రారంభం..

APSRTC Special Buses For Women:మహిళల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీఎస్‌ ఆర్టీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వారంలో రెండు రోజుల పాటు..

APSRTC Special Bus: మహిళల కోసం ఏపీఎస్‌ ఆర్టీసీ సరికొత్త నిర్ణయం.. శుక్రవారం నుంచే ప్రారంభం..
Apsrtc
Follow us

|

Updated on: Jan 08, 2021 | 8:26 AM

APSRTC Special Buses For Women: మహిళల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీఎస్‌ ఆర్టీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వారంలో రెండు రోజుల పాటు మహిళల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపించనున్నారు. ఈ విషయంమై అధికారులు గతంలోనే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయతే తాజాగా ఈ సర్వీసులను నేటి నుంచి (శుక్రవారం) ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రయల్‌ రన్‌ నిర్వహించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం, ఆదివారం మహిళలకు ప్రత్యేకంగా ఒక బస్సు సర్వీసు నడపనున్నారు. సర్వీసు నెంబర్‌ 3511 బస్సు ప్రతి శుక్రవారం రాత్రి 10.45 గంటలకు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు, ప్రతి ఆదివారం విజయవాడ నుంచి సర్వీసు నెంబర్‌ 36351 బస్సు రాత్రి 10.20 గంటలకు బయలు దేరి ఉదయం 4 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. ఈ క్రమంలో తొలి బస్సు ఈరోజు హైదరాబాద్ నుంచి బయలు దేరనుంది. ఈ బస్సుల్లో రిజర్వేషన్‌ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. వీటికి వచ్చే స్పందన ఆధారంగా మరిన్ని ప్రాంతాలకు బస్సులను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read: హైదరాబాద్ బోయిన్‌పల్లి కిడ్నాప్: అఖిల ప్రియ బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారణ, ఇంకా పరారీలోనే ఉన్న భర్త భార్గవ్ రామ్

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?