APSRTC losses: ఆర్టీసీ కొంపముంచిన కరోనా లాక్‌డౌన్.. ఈ ఏడాది ఏపీఎస్‌ఆర్టీసీకి వచ్చిన నష్టం ఎంతంటే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సులకు కరోనా సమయంలో ఒక్క బస్సు కూడా రోడ్డెక్కలేదు.

APSRTC losses: ఆర్టీసీ కొంపముంచిన కరోనా లాక్‌డౌన్..  ఈ ఏడాది ఏపీఎస్‌ఆర్టీసీకి వచ్చిన నష్టం ఎంతంటే..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 31, 2020 | 6:18 AM

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదేపిసింది. లాక్‌డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సులకు కరోనా సమయంలో ఒక్క బస్సు కూడా రోడ్డెక్కలేదు. దీంతో కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ ప్రభావంతో ఈ ఏడాది ఏపీఎస్ఆర్టీసీకి రూ.2,528 కోట్ల నష్టం వాటిల్లిందని సంస్థ ఎండీ కృష్ణబాబు తెలిపారు. నెలల పాటు బస్సులు డిపోలకే పరిమితమవడంతో 78.84 కోట్ల కిలోమీటర్లు బస్సులు నడవలేదని ఆయన వెల్లడించారు. అయితే, అత్యవసర సమయంలో కొందరికి మాత్రమే బస్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. పోలీసు, వైద్య సిబ్బందితో కలిసి తామూ కరోనా సమయంలో ప్రజలకు సేవలందించామన్నారు.

కాగా, కరోనా ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆర్టీసీ సిబ్బందిలో 5,586 మంది కరోనా బారినపడగా, అందులో 91మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అకాల మరణంతో ప్రాణాలను కోల్పోయిన సిబ్బంది కుటుంబాలను ఆదుకునేందుకు ఆర్టీసీ ముందుకువచ్చిందన్న కృష్ణబాబు.. ఒక రోజు వేతనాన్ని రూ.5లక్షల చొప్పున ఆ 91 కుటుంబాలకు ఇచ్చామన్నారు. కోవిడ్‌ వారియర్స్‌ బీమా రూ.50 లక్షల కోసం కేంద్రానికి లేఖ రాశామని చెప్పారు. గతేడాది నవంబరు 30 నాటికి ఆర్టీసీ ఆదాయం రూ.3,350 కోట్లు కాగా, ఈ ఏడాది అదే కాలానికి కేవలం రూ.827 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు.

ఇక, కరోనా కేసుల సంక్య గణనీయం తగ్గుముఖంపడుతుండటంతో ఇప్పుడిప్పుడే బస్సులు రోడ్డెక్కుతున్నాయి. దీంతో బస్సుల ఆక్యుపెన్సీ పుంజుకుంటోందని, మార్చి-2021 నాటికి పూర్వస్థితికి చేరుకోగలదని కృష్ణబాబు ధీమా వ్యక్తం చేశారు. జనవరి నుంచి పల్లె ప్రాంతాలకు సైతం అద్దె బస్సులు నడుపుతామని చెప్పారు. ఇక, సంక్రాంతి పండుగ సందర్భంగా 3,607 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని, వాటిలో 50శాతం అదనపు చార్జీ వసూలు చేస్తామని తెలిపారు. తెలంగాణకు త్వరలో 45వేల కిమీ మేరకు బస్సులు పెంచాల్సి ఉందని, ఆ రాష్ట్రంతో చర్చలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. కార్గో వ్యాపారం అభివృద్ధికి ప్రవేటు సంస్థలతో ఒప్పందం చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. సిబ్బందికి చెల్లించాల్సిన బకాయిలను త్వరలోనే అందిస్తామన్నారు. ఇప్పటి వరకూ 5,200 మంది అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకున్నామని, అవసరం మేరకు మిగతా వారిని కూడా చేర్చుకుంటామని ఎండీ కృష్ణబాబు వెల్లడించారు. అలాగే, బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని, ప్రభుత్వం ఇటీవల చెల్లించినందున సమస్య తీరిందన్నారు.

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా