సమ్మెకు స్వస్తి చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు

APSRTC Strike, సమ్మెకు స్వస్తి చెప్పిన ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు

ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చలేదంటూ ఈ నెల 13న ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీని విలీనం చేసే ప్రక్రియకు అడుగులు పడటంతో తమ సమ్మె ఆలోచనను కార్మికులు విరమించుకున్నారు. ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరికను తీర్చేలా విలీనానికి అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడం, ఆపై కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. దీంతో తాము సమ్మె నోటీసును ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ దామోదరరావు స్పష్టం చేశారు.

ఈ నెల 10న వచ్చి కలవాలని సీఎం వైఎస్ జగన్ నుంచి సమాచారం అందిందని, ఆ సమావేశంలో కార్మికుల సమస్యలను వివరిస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్న సమ్మె సన్నాహక సభలను కూడా రద్దు చేశామని దామోదర రావు తెలిపారు. కాగా ఆర్టీసీ విలీనంపై గతంలో ఆర్టీసీ ఎండీగా, డీజీపీగా పనిచేసి, రిటైర్ అయిన సీనియర్‌ ఐపీఎస్‌ ఆంజనేయరెడ్డి నేతృత్వంలో ఓ కమిటీని వేయాలని సీఎం వైఎస్ జగన్ అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *