Breaking News
  • హైదరాబాద్: జర్నలిస్టులందరికీ హెల్త్‌ కార్డులు అందించాలి, అన్ని ఆస్పత్రుల్లో సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఈనెల 20 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు టీయూడబ్ల్యూజే వినతి పత్రాలు-టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ.
  • ఆసియాలోనే లైఫ్‌ సైన్సెస్‌కు ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌ మారింది. ప్రపంచ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో మూడో వంతు హైదరాబాద్‌ సరఫరా చేస్తోంది. జాతీయ ఫార్మా ఉత్పత్తిలో హైదరాబాద్‌ వాటా 35శాతం-మంత్రి కేటీఆర్‌.
  • యాదాద్రి: గుండాల మండలం సుద్దాల దగ్గర ప్రమాదం, కారు, బైక్‌ ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు.
  • విజయవాడ: ఎమ్మార్వో వనజాక్షిపై టూటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు, తమను కులం పేరుతో దూషించిందని ఫిర్యాదు చేసిన మహిళా రైతులు.
  • మహబూబాబాద్: పోడు భూముల ఆక్రమణదారులకు కలెక్టర్‌ హెచ్చరిక. 10 ఎకరాలకు మించి పోడు భూములు ఆక్రమించిన 119 మంది. ఆక్రమణదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, నేతలు, కుల సంఘాల నేతలు. భూములు వెంటనే తిరిగి అప్పగించాలని కలెక్టర్ ఆదేశం. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరిక.
  • ప్రాణం తీసిన సెల్ఫీ. కృష్ణాజిల్లా: నూజివీడులో విషాదం. సూరంపల్లి కాలువ దగ్గర సెల్ఫీ దిగేందుకు యువకుడు యత్నం. ప్రమాదవశాత్తు కాలువలో పడి యువకుడు మృతి. బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న పవన్‌.

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతుగా ఏపీఎస్‌ఆర్టీసీ.. ఏం చేసిందంటే?

APSRTC Employees Support To TSRTC Workers, టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతుగా ఏపీఎస్‌ఆర్టీసీ.. ఏం చేసిందంటే?

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి విద్యార్థి సంఘాల వరకు అందరి మద్దతు లభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కోవలో ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికులు కూడా వారికి పూర్తి మద్దతుగా నిలవనున్నారు. వారు కోరిన న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తాము అండగా ఉంటామని ఏపీఎస్‌ఆర్టీసీ జేఏసీ తెలిపింది. ఈ నేపథ్యంలో 13వ తారీఖు నుంచి ధర్నాలు చేయాలని నిర్ణయించారు. ఏపీలోని 13 జిల్లాల్లో ఉన్న 128 డిపోల్లో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అటు తెలంగాణ ఆర్టీసీ కూడా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటుగా పలు న్యాయమైన డిమాండ్లు కోరుతూ సమ్మెకు పిలుపునిచ్చారు. ఏడు రోజులుగా సాగుతున్న ఈ సమ్మె తీవ్ర స్థాయికి చేరుకోవడంతో పాటుగా అందరి మద్దతు కూడా లభించింది. అయితే, కార్మికులకు మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కాగా, ప్రతిపక్షాలు ఈ నెల 19న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది.