ఏపీలో రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు.. సీట్లు కుదింపు ఇలా..

ఆంధప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రజా రవాణాను పునరుద్ధరణ చేసేందుకు ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. మూడోదశ లాక్‌డౌన్ ముగిసిన వెంటనే ఏపీలో బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఇక కరోనా నేపధ్యంలో బస్సుల్లో ప్రయాణించే వారి కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు. ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేలా బస్సుల్లో సీట్లను సర్దుబాటు చేయడమే కాకుండా హ్యాండ్ శానిటైజర్లను సైతం అందుబాటులో ఉంచనున్నారు. Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం ఇప్పటికే దానికి సంబంధించి సూపర్ […]

ఏపీలో రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు.. సీట్లు కుదింపు ఇలా..
Follow us

|

Updated on: May 15, 2020 | 5:58 PM

ఆంధప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రజా రవాణాను పునరుద్ధరణ చేసేందుకు ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. మూడోదశ లాక్‌డౌన్ ముగిసిన వెంటనే ఏపీలో బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఇక కరోనా నేపధ్యంలో బస్సుల్లో ప్రయాణించే వారి కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు. ప్రయాణికుల మధ్య భౌతిక దూరం ఉండేలా బస్సుల్లో సీట్లను సర్దుబాటు చేయడమే కాకుండా హ్యాండ్ శానిటైజర్లను సైతం అందుబాటులో ఉంచనున్నారు.

Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

ఇప్పటికే దానికి సంబంధించి సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉండే సీటింగ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఒక్క సూపర్ లగ్జరీ బస్సుల్లో మాత్రమే కాకుండా.. అల్ట్రాడీలక్స్, ఎక్స్‌ప్రెస్‌, పల్లెవెలుగు, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ సర్వీసు బస్సుల్లో పూర్తిగా సీటింగ్ మార్పులు చేస్తున్నారు. ఇక ఆ సీటింగ్ కుదింపు ఈ విధంగా ఉండనుంది.

  • సూపర్ లగ్జరీ(36 సీట్లు): 24 సీట్లకు కుదింపు
  • అల్ట్రా డీలక్స్(40 సీట్లు): 27 సీట్లకు కుదింపు
  • ఎక్స్‌ప్రెస్‌(50 సీట్లు): 30 సీట్లకు కుదింపు
  • పల్లెవెలుగు(60 సీట్లు): 36 సీట్లకు కుదింపు
  • సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌(45 సీట్లు): 23 సీట్లకు కుదింపు
  • సిటీ ఆర్డినరీ(46 సీట్లు): 24 సీట్లకు కుదింపు

Read This: కిమ్ మరో సంచలనం.. ఈసారి వారిపై రహస్య నిఘా!