అమరావతిలో హై‌టెన్షన్.. ఆర్టీసీ బస్సులు రద్దు!

ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. అధికారిక వికేంద్రీకరణ బిల్లులను ఇవాళ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ముందుగా కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. దీనితో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే పోలీసుల ఆదేశాల మేరకు విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే బస్సులను […]

అమరావతిలో హై‌టెన్షన్.. ఆర్టీసీ బస్సులు రద్దు!
Follow us

|

Updated on: Jan 20, 2020 | 11:53 AM

ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. అధికారిక వికేంద్రీకరణ బిల్లులను ఇవాళ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ముందుగా కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.

దీనితో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే పోలీసుల ఆదేశాల మేరకు విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే బస్సులను ఆర్టీసీ రద్దు చేసింది. తదుపరి ఆదేశాల వచ్చిన తర్వాత బస్సులను పునరుద్ధరిస్తామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.