గుడ్‌న్యూస్: రోడ్డేక్క‌నున్న ఆర్టీసీ బస్సులు..ఏపీలో రిజర్వేషన్లు షురూ !

ఏపీఎస్ ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త నందించింది. ఈ నెల 15 త‌ర్వాత ఆర్టీసీ బ‌స్సులు అందుబాటులోకి వ‌స్తాయ‌నే సంకేతాలు పంపింది. ఈ మేర‌కు ఆన్‌లైన్ రిజ‌ర్వేష‌న్లు మొద‌లు పెట్టింది. ఈ నెల 14తో లాక్‌డౌన్ ...

గుడ్‌న్యూస్: రోడ్డేక్క‌నున్న ఆర్టీసీ బస్సులు..ఏపీలో రిజర్వేషన్లు షురూ !
Follow us

|

Updated on: Apr 06, 2020 | 7:16 AM

ఏపీఎస్ ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త నందించింది. ఈ నెల 15 త‌ర్వాత ఆర్టీసీ బ‌స్సులు అందుబాటులోకి వ‌స్తాయ‌నే సంకేతాలు పంపింది. ఈ మేర‌కు ఆన్‌లైన్ రిజ‌ర్వేష‌న్లు మొద‌లు పెట్టింది. ఈ నెల 14తో లాక్‌డౌన్ ముగుస్తుంద‌ని, ఆ తర్వాత బస్సు స‌ర్వీసుల‌ను పున‌రుద్ద‌రించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ స‌న్న‌ద్ధ‌మవుతోంది. అయితే, ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన మ‌రో విష‌యం కూడా ఉంది. అదేంటంటే..?

క‌రోనా నేప‌థ్యంలో రాష్ట్ర‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ఈ మేర‌కు ర‌వాణా వ్య‌వ‌స్థ పూర్తిగా స్తంభించి పోయింది. దీంతో ఎక్క‌డి వారు అక్క‌డే ఉండిపోయారు. కాగా, ఈ నెల 14తో లాక్‌డౌన్ ముగిసిపోతుంది. కాబ‌ట్టి, ఆర్టీసీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టాల‌ని అధికారులు భావిస్తున్నారు. ఈ మేర‌కు 15 నుంచి ఆన్‌లైన్‌లో బ‌స్ టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. అయితే, దూర ప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సులను నడపకూడదని ఆర్టీసీ అధికారులు నిర్ణ‌యించారు. ప్రస్తుతానికి సూపర్‌ లగ్జరీ, అల్ట్రా డీలక్స్‌ బస్సులకు రిజర్వేషన్లు మాత్రమే ప్రారంభించారు.

ఆర్టీసీ బస్సుల్లో కూడా ఏసీ సర్వీసులను గణనీయంగా తగ్గించి 90% నాన్‌ ఏసీ సూపర్‌ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. విజయవాడ బస్టాండ్‌ నుంచి నాన్‌ ఏసీ సర్వీసులను మాత్రమే ఆర్టీసీ ప్రారంభించనుంది. వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ మీదుగా వెళ్లేవి మాత్రం ఏసీ సర్వీసులను నడపనున్నారు. కరోనా వైరస్‌ ఏసీలో త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గిన తర్వాత దశలవారీగా ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించారు.