ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. విజయవాడ నుంచి చెన్నై ప్రారంభం కానున్న ఆర్టీసీ బస్సు సర్వీసులు

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణ ప్రారంభం కాబోతోంది. పొరుగు రాష్ట్రాలకు బస్సులను నడిపించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు మరింత వేగం పెంచారు. ఒక్కటొక్కటిగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు రోడ్డెక్కుతున్నాయి.

  • Sanjay Kasula
  • Publish Date - 2:28 pm, Tue, 24 November 20

APSRTC Bus :  అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణ ప్రారంభం కాబోతోంది. పొరుగు రాష్ట్రాలకు బస్సులను నడిపించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు మరింత వేగం పెంచారు. ఒక్కటొక్కటిగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు రోడ్డెక్కుతున్నాయి. ఇదివరకే ఏపీ-తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు రోడ్డెక్కాయి. ఇక ఏపీ-తమిళనాడు మధ్య బస్సుల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.

ఈ రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు పునఃప్రారంభం కావడం ఎనిమిది నెలల సుదీర్ఘ విరామం తరువాత ఇదే తొలిసారి. ఈ నెల 25వ తేదీన చెన్పైకి బస్సులను నడిపించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేపట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ సహా అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయిన విషయం తెలిసిందే. అన్‌లాక్‌లో భాగంగా అంతర్రాష్ట్రాల మధ్య ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రజా, ప్రైవేటు వాహనాలు రాకపోకలు సాగించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్రాలోని పలు ప్రాంతాల నుంచి చెన్నైకి ఆర్టీసీ బస్సులు బయలుదేరనున్నాయి. ఆన్ లైన్ టిక్కెట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో  చెన్నైకి టికెట్లు తీసుకునేవారి నుంచి డిమాండ్ పెరగుతోంది. తిరుపతి, గూడూరు, చుట్టు ప్రక్కల చెన్నై కి బోర్డర్ సమీపం నుంచి చెన్నై కు మరిన్ని బస్సులు నడపాలని ఎపిఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.