సరికొత్త వేరియేషన్‌లో వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్.. తొలిసారిగా మర్కెట్‌లోకి విడుదల చేసిన యాపిల్ కంపెనీ..

ఐఫోన్ల దిగ్గజం యాపిల్ కంపెనీకి ఉండే క్రేజీయే వేరు. కొత్త మోడల్ మార్కెట్లో విడుదల చేసిందంటే చాలు వినియోగదారులు క్యూ

సరికొత్త వేరియేషన్‌లో వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్.. తొలిసారిగా మర్కెట్‌లోకి విడుదల చేసిన యాపిల్ కంపెనీ..
Follow us

|

Updated on: Dec 09, 2020 | 4:54 PM

ఐఫోన్ల దిగ్గజం యాపిల్ కంపెనీకి ఉండే క్రేజీయే వేరు. కొత్త మోడల్ మార్కెట్లో విడుదల చేసిందంటే చాలు వినియోగదారులు క్యూ కట్టాల్సిందే. తాజాగా ఈ కంపెనీ మొదటిసారిగా వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ను రిలీజ్ చేసింది. ఎయిర్ పోడ్స్ మ్యాక్స్ పేరుతో దేశీయంగా విడుదల చేసింది.

యాపిల్‌ వెబ్‌సైట్‌, ఆధీకృత రిటైలర్ల ద్వారా వీటిని విక్రయించనుంది. స్థానికంగా వీటి ధర రూ. 59,900గా ప్రకటించింది. ఈ నెల 15 నుంచి వీటిని సరఫరా చేయనున్నట్లు తెలియజేసింది. తాజా అమ్మకాలలో భాగంగా 25 దేశాలు, ప్రాంతాలకు వీటిని అందించనున్నట్లు వెల్లడించింది. ఐప్యాడ్లు తదితర యాపిల్‌ డివైస్‌లు ఐవోఎస్‌ 14.3 లేదా తదుపరి అప్‌గ్రేడ్‌తో పనిచేస్తాయని ఐఫోన్ల దిగ్గజం పేర్కొంది. ఈ సందర్భంగా యాపిల్ సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ గ్రెగ్‌ జాస్వియక్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా హెడ్‌ఫోన్స్‌లో ఎయిర్‌పోడ్స్‌ జనాదరణ పొందినట్లు పేర్కొన్నారు. ఎయిర్‌పోడ్స్‌ మ్యాక్స్‌ ద్వారా అత్యంత నాణ్యతమైన ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ను పొందవచ్చని తెలియజేశారు. ఆధునిక డిజైన్‌, ప్రతిభావంతమైన హెచ్‌1 చిప్‌, అడ్వాన్స్‌డ్‌ సాఫ్ట్‌వేర్‌ తదితరాల కారణంగా వినియోగదారులు అత్యుత్తమ వైర్‌లెస్‌ ఆడియోను ఆనందించవచ్చని వివరించారు. ఎడాప్టివ్‌ ఈక్విలైజర్‌ కలిగి ఉన్నట్లు తెలియజేశారు. మూడు మైక్రోఫోన్ల ద్వారా అనవసర శబ్దాలను తగ్గిస్తుందని(నాయిస్‌ రిడక్షన్‌) పేర్కొన్నారు. కాగా దీని ధర మాత్రం ఎక్కువైందని కొంతమంది వినియోగదారులు మాత్రం అసంతృప్తితో ఉన్నారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?