“యాపిల్‌” మరింత చేరువగా

Apple Products will Available in Online Stores., “యాపిల్‌” మరింత చేరువగా

ఇండియన్‌ మార్కెట్‌లో యాపిల్‌ డివైజ్‌లకు ఉన్నక్రేజ్‌ చెప్పనక్కర్లేదు. వినియోగదారులకు యాపిల్‌పై ఉన్నఆసక్తిని ఇప్పుడు మరింత రెట్టింపు చేస్తోంది. ఇకపై యాపిల్‌ సొంత ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా అమ్మకాలు చేపట్టనుంది. యాపిల్‌ తన ఐఫోన్లు, వాచ్‌లు, మాక్‌బుక్స్‌, ఇతర ఉత్పత్తులను విక్రయించేందుకు ఇప్పటి వరకు థర్డ్‌పార్టీ సంస్థలపై ఆధారపడింది. కానీ, సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ వాణిజ్యంలో ప్రభుత్వం ఇటీవల ఎఫ్‌డీఐ నిబంధనల్ని సరళతరం చేసిన నేపథ్యంలో యాపిల్‌ భారత మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం.

భారత ప్రభుత్వం యాపిల్‌ లాంటి కంపెనీలకు 30 శాతం ప్రొడక్ట్‌లను ఇక్కడే తయారు చేయాలనే షరతు విధించింది గతంలో.. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం తాజాగా కొంత సడలింపు ఇచ్చింది. ఇకపై ఐదేళ్లకు సగటున 30శాతం సమీకరించినా సరిపోతుందని తెలిపింది. దీంతో ఎట్టకేలకు యాపిల్‌ భారత్‌లో తన తొలి ఆన్‌లైన్‌ స్టోర్‌ను ప్రారంభించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో యాపిల్‌ లాంటి కంపెనీలు దేశంలో తమ మార్కెట్‌ను మరింత పెంచుకునేందుకు అవకాశం లభించింది. ఎందుకంటే ఆన్‌లైన్‌ అమ్మకాల్లో నకిలీలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. సొంత బ్రాండ్ నుంచే అమ్మకాలు చేయడం వల్ల గిరాకీ పెరిగే అవకాశముంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది వరకు ముంబైలో యాపిల్‌ తన రిటైల్‌ స్టోర్‌ను కూడా ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *