మార్కెట్‌లోకి యాపిల్ సంస్థ నుంచి కొత్త టీవీ లాంచ్..

యాపిల్ కంపెనీ కొత్తగా ప్రవేశపెట్టిన ‘యాపిల్ టీవీ’ వివరాలను ప్రకటించింది ఈ సంస్థ. నాణ్యత, మంచి కంటెంట్ ఉన్న నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టినందుకు గర్వపడుతున్నామని తెలిపింది యాపిల్ సంస్థ. అమెరికాలో సోమవారం యాపిల్ కొత్త టీవీ స్ట్రీమింగ్‌ను ఆర్గనైజ్ చేశారు. ప్రత్యేకమైన స్టోరీస్‌తో, మంచి సినిమాలతో, కొత్త కొత్త డాక్యుమెంటరీలతో యాపిల్ టీవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు. సృజనాత్మకత కలిగిన స్టోరీస్‌తో యాపిల్ టీవీ హోమ్ పేజ్ ఉంటుందని తెలిపారు. ఇప్పటికే.. స్టీవెన్ స్పీల్బర్గ్, రీస్ విథర్స్పూన్ […]

మార్కెట్‌లోకి యాపిల్ సంస్థ నుంచి కొత్త టీవీ లాంచ్..
Follow us

| Edited By:

Updated on: Mar 26, 2019 | 4:17 PM

యాపిల్ కంపెనీ కొత్తగా ప్రవేశపెట్టిన ‘యాపిల్ టీవీ’ వివరాలను ప్రకటించింది ఈ సంస్థ. నాణ్యత, మంచి కంటెంట్ ఉన్న నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టినందుకు గర్వపడుతున్నామని తెలిపింది యాపిల్ సంస్థ. అమెరికాలో సోమవారం యాపిల్ కొత్త టీవీ స్ట్రీమింగ్‌ను ఆర్గనైజ్ చేశారు. ప్రత్యేకమైన స్టోరీస్‌తో, మంచి సినిమాలతో, కొత్త కొత్త డాక్యుమెంటరీలతో యాపిల్ టీవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు. సృజనాత్మకత కలిగిన స్టోరీస్‌తో యాపిల్ టీవీ హోమ్ పేజ్ ఉంటుందని తెలిపారు. ఇప్పటికే.. స్టీవెన్ స్పీల్బర్గ్, రీస్ విథర్స్పూన్ మరియు జెన్నిఫర్ అనిస్టన్ వంటి ఇతరులతో కలిసి సినిమాలు, డాక్యుమెంటరీలు చేస్తున్నామని అన్నారు.

కాగా.. ఈ కార్యక్రమంలో హాలీవుడ్ డైరెక్టర్ స్పీల్బర్గ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఫస్ట్ టైం యాపిల్‌కు పనిచేసే ఛాన్స్ దక్కిందని అన్నారు. యాపిల్ టీవీ బాగా పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా అని తెలిపారు. అలాగే.. రీస్, జెన్నిఫర్ మాట్లాడుతూ యాపిల్ టీవీలోని స్టీవ్ కారెల్ వారి సీరిస్, ది మార్నింగ్ షోల గురించి మాట్లాడారు.

యాపిల్ టీవీ యాడ్స్ లేకుండా రన్ అవుతుందనీ.. అందరూ చూసేందుకు బడ్జెట్‌లో వీలుగా ఉంటుందని పేర్కొంది యాపిల్ సంస్థ. అలాగే.. ఆఫ్‌లైన్‌లోనూ, ఆన్‌లైన్‌లోనూ యాపిల్ టీవీని చూడొచ్చని సంస్థ తెలియజేసింది. యాపిల్ టీవీ కూడా మే నెలలో ఓ కొత్త పద్దతిని విడుదల చేస్తోంది. ప్రజలు యాపిల్ టీవీ ఛానెల్స్, ప్రొవైడర్ల కోసం హెచ్‌బీఓ మరియు అమెజాన్ ప్రైమ్‌లను యాక్సెస్ చేయాలని తెలిపింది ఈ సంస్థ.