Apple: 39 వేల చైనా యాప్‌లను తొలగించిన యాపిల్ సంస్థ… మరో 7 వేల యాప్‌లపై సైతం నిషేధం…

అమెరికాకు చెందిన యాపిల్ సంస్థ చైనాకు భారీ షాక్ ఇచ్చింది. యాపిల్ చైనా యాప్ స్టోర్ నుంచి 39 వేల యాప్‌లను...

Apple: 39 వేల చైనా యాప్‌లను తొలగించిన యాపిల్ సంస్థ... మరో 7 వేల యాప్‌లపై సైతం నిషేధం...
Follow us

| Edited By:

Updated on: Jan 04, 2021 | 5:05 AM

అమెరికాకు చెందిన యాపిల్ సంస్థ చైనాకు భారీ షాక్ ఇచ్చింది. యాపిల్ చైనా యాప్ స్టోర్ నుంచి 39 వేల యాప్‌లను తొలిగించినట్లు ప్రకటించింది. గడువు ముగిసిన తిరిగి లైసెన్స్‌ను పొందలేని కారణంగా యాప్ లను నిషేధించినట్లు వివరించింది. చైనాకు చెందిన కొన్ని అథారిటీలు లైసెన్స్‌ లేని యాప్‌లను నిషేధించాలని పేర్కొన్నాయి. దీంతో వీటిని నిషేధించినట్లు పేర్కొంది. యాపిల్ ప్రారంభంలో గడువును జూన్ చివరి వరకు ఇచ్చింది. తరువాత అది డిసెంబర్ 31 వరకు పొడగించింది. కానీ పలు సంస్థలు సద్వినియోగం చేసుకోలేకపోయాయి. అయితే వీటితో పాటు మరో 7 వేల యాప్ లను నిషేధించినట్లు ప్రకటించింది. యాపిల్ నిషేధించిన యాప్‌లలో కొన్ని ప్రముఖ యాప్ లు కూడా ఉన్నాయి.

Also Read: Pilot Less Planes: ఫైలెట్ లెస్ యుద్ద విమాన తయారీ ప్రారంభించిన జపాన్.. శత్రువులను ఎదుర్కొనేందుకు..