జూలై 1 నుంచి సీఎం జగన్ ప్రజా దర్బార్

జూలై 1 నుంచి ఏపీ సీఎం జగన్ ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ప్రజల వినతులను ఆయనే నేరుగా స్వీకరించనున్నారు. జూలై 1 నుంచి ప్రతిరోజు ఉదయం 8 గంటల తర్వాత గంట సేపు ప్రజల విఙ్ఞప్తులను స్వీకరించి సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కారాలను సూచించనున్నారు. ఇప్పటికే తమ కష్టాలు, బాధల్ని సీఎం‌కు విన్నవించుకునేందుకు తాడేపల్లికి వస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. దీంతో ప్రజా సమస్యలను నేరుగా వినేందుకు, అక్కడికక్కడే పరిష్కరించేందుకు ఆయన ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే […]

జూలై 1 నుంచి సీఎం జగన్ ప్రజా దర్బార్
Follow us

| Edited By:

Updated on: Jun 29, 2019 | 5:42 PM

జూలై 1 నుంచి ఏపీ సీఎం జగన్ ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ప్రజల వినతులను ఆయనే నేరుగా స్వీకరించనున్నారు. జూలై 1 నుంచి ప్రతిరోజు ఉదయం 8 గంటల తర్వాత గంట సేపు ప్రజల విఙ్ఞప్తులను స్వీకరించి సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కారాలను సూచించనున్నారు. ఇప్పటికే తమ కష్టాలు, బాధల్ని సీఎం‌కు విన్నవించుకునేందుకు తాడేపల్లికి వస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. దీంతో ప్రజా సమస్యలను నేరుగా వినేందుకు, అక్కడికక్కడే పరిష్కరించేందుకు ఆయన ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికోసం సీఎం క్యాంప్ కార్యాలయాన్ని సిద్ధం చేశారు. మరోవైపు ఆయనను కలిసేందుకు దూరప్రాంతాలనుంచి వచ్చే వారికోసం ఓ షెడ్డును కూడా నిర్మించారు. ఇదిలా ఉంటే ప్రజా సమస్యల్ని తీర్చేందుకు, ప్రజలనుంచి వచ్చే విఙ్ఞప్తుల్ని స్వీకరించేందుకు ఓ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. ప్రజాదర్బార్‌కు జనం అధికసంఖ్యలో రానున్న నేపధ్యంలో పటిష్టమైన భద్రతా చర్యల్ని తీసుకుంటున్నారు.