ప్రభుత్వ ఉదాసీనతే ప్రాణాలు తీసింది: రాహుల్‌

న్యూదిల్లీ: అసోంలో విషపూరిత మద్యం తాగి దాదాపు 140 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ అసమర్థపాలనను కొనసాగిస్తుందని విమర్శించారు. ‘అసోంలోని ప్రభుత్వం ఉదాసీనత, అసమర్థత కారణంగా కల్తీ మద్యం సరఫరా అయింది.. 140 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన […]

ప్రభుత్వ ఉదాసీనతే ప్రాణాలు తీసింది: రాహుల్‌
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 4:24 PM

న్యూదిల్లీ: అసోంలో విషపూరిత మద్యం తాగి దాదాపు 140 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ అసమర్థపాలనను కొనసాగిస్తుందని విమర్శించారు. ‘అసోంలోని ప్రభుత్వం ఉదాసీనత, అసమర్థత కారణంగా కల్తీ మద్యం సరఫరా అయింది.. 140 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు.

ఈ ఘటనతో భాజపాపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అక్రమ, కల్తీ మద్యాన్ని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపిస్తోంది. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లోనూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, అసోంలోని గోలాఘాట్‌లో కూలీలు గురువారం రాత్రి వేడుక చేసుకుని మద్యం తాగారు. అనంతరం అస్వస్థతకు గురై 140 మంది మృతి చెందారు. జోర్హత్‌ వైద్య కళాశాల ఆస్పత్రిలో (జేఎమ్‌సీహెచ్‌) మరి కొందరు చికిత్స పొందుతున్నారు. వారిని కలిసి పరామర్శించిన అసోం ముఖ్యమంత్రి సోనోవాల్‌.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు.