ఇండియాతో పాటు స్వాతంత్ర్య దినోత్స‌వం జ‌రుపుకుంటున్న మ‌రికొన్ని దేశాలు

1947, ఆగ‌స్టు 15న భార‌తీయులను బాస‌లుగా చేసి ప‌రిపాలించిన‌ బ్రిటీష్ వాళ్లు దేశాన్ని వ‌దిలి వెళ్లిపోయారు. అప్ప‌ట్నుంచి ప్ర‌తి సంవ‌త్స‌రం ఆగస్టు 15ను స్వాతంత్ర్య దినోత్స‌వంగా సెల్ర‌బేట్ చేస్తుకుంటున్నాం.

ఇండియాతో పాటు స్వాతంత్ర్య దినోత్స‌వం జ‌రుపుకుంటున్న మ‌రికొన్ని దేశాలు
Follow us

|

Updated on: Aug 15, 2020 | 1:21 PM

1947, ఆగ‌స్టు 15న భార‌తీయులను బాస‌లుగా చేసి ప‌రిపాలించిన‌ బ్రిటీష్ వాళ్లు దేశాన్ని వ‌దిలి వెళ్లిపోయారు. అప్ప‌ట్నుంచి ప్ర‌తి సంవ‌త్స‌రం ఆగస్టు 15ను స్వాతంత్ర్య దినోత్స‌వంగా సెల్ర‌బేట్ చేస్తుకుంటున్నాం. ఎంతో మంది స‌మ‌ర‌యోధుల త్యాగాల‌తో మ‌న దేశానికి స్వాతంత్ర్యం సిద్దించింది. నేటితో మ‌న‌కు ఇండిపెండెన్స్ వ‌చ్చి 73 సంవ‌త్స‌రాలు నిండి 74వ సంవ‌త్స‌రంలో ప్ర‌వేశించాము. కాగా మ‌న‌తో పాటే మ‌రికొన్ని దేశాలు కూడా స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నాయి. అవేంటో చూద్దాం.

ఉత్త‌ర, ద‌క్షిణ కొరియాలు

ఇక ఆగ‌స్టు 15న ఉత్త‌ర, ద‌క్షిణ కొరియాలు జాతీయ విముక్తి దినోత్సవంగా సెల‌బ్రేట్ చేసుకుంటాయి. యుఎస్, సోవియట్ దళాలు కొరియాపై దశాబ్దాలుగా ఉన్న‌ జపాన్ ఆక్రమణను ముగించిన రోజు కాబ‌ట్టి దక్షిణ, ఉత్తర కొరియా రెండింటిలోనూ ఆగస్టు 15న ప్రతి సంవత్స‌రం పండుగ‌లా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

బెహ్రెయిన్

బెహ్రెయిన్ అంటే అర్థం రెండు స‌ముద్రాలు. 1931 లో చమురును కనుగొని రిఫైనరీని నిర్మించిన గల్ఫ్‌లోని మొదటి రాష్ట్రాలలో బెహ్రెయిన్ ఒకటి. 1913 లో.. బ్రిటన్, ఒట్టోమన్ ప్రభుత్వం బహ్రెయిన్ స్వాతంత్ర్యాన్ని గుర్తించే ఒప్పందంపై సంతకం చేశాయి. అయిన‌ప్ప‌టికీ ఈ దేశం 1931 వ‌ర‌కు వివిధ కార‌ణాల వ‌ల్ల‌ బ్రిటీస్ ప‌రిపాల‌లోనే ఉంది. 1971 లో, బహ్రెయిన్ త‌మ‌ది స్వాతంత్ర్య దేశంగా ప్ర‌క‌టించింది. బ్రిటన్‌తో స్నేహ పూర్వ‌క‌ ఒప్పందంపై సంతకం చేసింది. అక్క‌డ‌ షేక్ ఇసా మొదటి ఎమిర్ అయ్యారు. ఆగస్టు 14 న జరిగిన స్నేహ ఒప్పందంపై సంత‌కాలు జరిగాయ‌ని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. కానీ బహ్రెయిన్ ఆగస్టు 15 ను తన స్వాతంత్ర్య దినోత్సవంగా అధికారికంగా గుర్తించింది.

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను డీఆర్ కాంగో అని కూడా పిలుస్తారు. ఇది అపారమైన ఆర్థిక వనరులతో కూడిన విస్తారమైన దేశం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 న రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ప్రభుత్వ సెలవుదినంగా ప్ర‌క‌టించి, స్వాతంత్ర్య దినోత్స‌వంగా జ‌రుపుకుంటారు. 1960 లో ఈ రోజున ఫ్రాన్స్ నుంచి డీఆర్ కాంగో స్వాతంత్ర్యాన్ని పొందిన‌ట్లు చెబుతున్నారు.

లిచ్టెన్‌స్టెయిన్

ఆగస్టు 15 లిచ్టెన్‌స్టెయిన్ జాతీయ దినోత్సవంగా జ‌రుపుకుంటారు. ఆ రోజు రాత్రి 10 గంటలకు సాంప్రదాయకంగా జరిగే బాణసంచా పేలుళ్లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫోక‌స్ అయ్యాయి. 5 ఆగస్టు 1940 న, ప్రిన్సిపాలిటీ ఆఫ్ లిచ్టెన్స్టెయిన్ ప్రభుత్వం ఆగస్టు 15 ను దేశ జాతీయ సెలవు దినంగా అధికారికంగా ప్రకటించింది. అక్క‌డ మేరీ పండుగ‌ను ఆగస్టు 15 న జరుపుకుంటారు. అంతేకాదు లిచ్టెన్‌స్టెయిన్ పాలించిన‌ ప్రిన్స్ ఫ్రాంజ్ జోసెఫ్ II పుట్టినరోజు ఆగస్టు 16. దీంతో వారు ఈ రెండిటీ స‌మ్మేళ‌నంగా ఆగ‌స్టు 15 న జాతీయ దినోత్సంగా జ‌రుపుకుంటారు.

Also Read : కరోనా టీకాపై ప్రధాని మోదీ స్ప‌ష్ట‌త‌

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?