ఏపీ భారీ అవినీతికి పాల్పడుతుంది -అమిత్ షా

రాజమండ్రిలో పర్యటించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. చంద్రబాబుకు పాకిస్తాన్ ప్రధానిపై భరోసా ఉంది కానీ.. మన ప్రధానిపై లేదని మండిపడ్డారు. అమరావతికి పోలవరానికి కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఖర్చు చేయకుండా భారీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. అధికారంలో ఎవరు ఉండాలో నిర్ణయించే ఎన్నికలు రాబోతున్నాయన్నారు అమిత్ షా. విభజన చట్టంలోని అంశాలను 90 శాతం నెరవేర్చామన్నారు. ఐదేళ్లలో 20 ప్రతిష్టాత్మక సంస్థలను కేంద్రం ఏపీకి ఇచ్చిందన్నారు. ఎన్టీఆర్, వాజ్ […]

ఏపీ భారీ అవినీతికి పాల్పడుతుంది -అమిత్ షా
Follow us

| Edited By:

Updated on: Feb 22, 2019 | 8:19 AM

రాజమండ్రిలో పర్యటించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. చంద్రబాబుకు పాకిస్తాన్ ప్రధానిపై భరోసా ఉంది కానీ.. మన ప్రధానిపై లేదని మండిపడ్డారు. అమరావతికి పోలవరానికి కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఖర్చు చేయకుండా భారీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. అధికారంలో ఎవరు ఉండాలో నిర్ణయించే ఎన్నికలు రాబోతున్నాయన్నారు అమిత్ షా. విభజన చట్టంలోని అంశాలను 90 శాతం నెరవేర్చామన్నారు. ఐదేళ్లలో 20 ప్రతిష్టాత్మక సంస్థలను కేంద్రం ఏపీకి ఇచ్చిందన్నారు. ఎన్టీఆర్, వాజ్ పేయి, మోడీని చంద్రబాబు మోసం చేశారని అన్నారు అమిత్ షా.