గ్రామ, వార్డ్ సెక్రటరీ పరీక్షలకు సర్వసన్నద్ధం

సెప్టెంబర్ 20 నుంచి 27 వరకు జరుగనున్న గ్రామ, వార్డ్ సెక్రెటరీ పరీక్షలకు గుంటూరు జిల్లా సర్వసన్నద్ధంగా ఉందని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. జిల్లాలో 212 సెంటర్స్ లో 80, 214 మంది అభ్యర్దులు పరీక్షలు రాయనున్నారని వెల్లడించారు.

గ్రామ, వార్డ్ సెక్రటరీ పరీక్షలకు సర్వసన్నద్ధం
Follow us

|

Updated on: Sep 17, 2020 | 3:34 PM

సెప్టెంబర్ 20 నుంచి 27 వరకు జరుగనున్న గ్రామ, వార్డ్ సెక్రటరీ పరీక్షలకు గుంటూరు జిల్లా సర్వసన్నద్ధంగా ఉందని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. జిల్లాలో 212 సెంటర్స్ లో 80, 214 మంది అభ్యర్దులు పరీక్షలు రాయనున్నారని వెల్లడించారు. పరీక్షరాసే అభ్యర్థులు ఉదయం 8 గంటల లోపే ఆయా సెంటర్స్ కు చేరుకోవాలని.. కోవిడ్ నియమ నిబంధనల ప్రకారం పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ చెప్పారు. ప్రతి ఒక్కరూ మాస్క్, సాని టైజర్ తీసుకొని పరీక్షాకేంద్రానికి రావాలని.. 10 గంటల తర్వాత వస్తే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదని అన్నారు. బయట నుంచి వచ్చే వారి కోసం హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేశామన్న కలెక్టర్.. కరోనా పాజిటివ్ ఉన్నవారికి ఐసోలేషన్ గదులు ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. జిల్లాలో కరోన వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని.. ఈ నెలలో జిల్లాలో 7.12 శాతం కేసులు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు. పర్మిషన్ లేకుండా కోవిడ్ సెంటర్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. ఇష్టానుసారంగా ప్రైవేట్ హాస్పిటల్స్ అధిక ధరలు వసూలు చేస్తే వారి హాస్పిటల్ గుర్తింపు రద్దు చేస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ శామ్యూల్ స్పష్టం చేశారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..