గ్రామవాలంటీర్లు ..సేవకులా? లేక వైసీపీకి విధేయులా? అసలు నిజమేంటీ?

ముఖ్యమంత్రిగా తొలిసారి పదవి చేపట్టినా.. పాలనలో మాత్రం తన మార్క్ ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారు ఏపీ సీఎం జగన్. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను తూ.చ. తప్పకుండా అమలు చేయడంలో ఆయన ముందుంటున్నారు. నవరత్నాల పేరుతో సీఎం జగన్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో  అమలు కోసం నిరంతరం క‌ృషిచేస్తున్న సీఎం జగన్ ఒక్కరే అనిపించేలా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారంలోకి రాకముందే ప్రకటించిన విధంగా లక్షలాది ఉద్యోగాలను కల్పించారు. నెలకు రూ.5 వేలు జీతంతో గ్రామ వాలంటీర్ […]

గ్రామవాలంటీర్లు ..సేవకులా? లేక వైసీపీకి విధేయులా? అసలు  నిజమేంటీ?
Follow us

| Edited By:

Updated on: Oct 13, 2019 | 6:04 PM

ముఖ్యమంత్రిగా తొలిసారి పదవి చేపట్టినా.. పాలనలో మాత్రం తన మార్క్ ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారు ఏపీ సీఎం జగన్. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను తూ.చ. తప్పకుండా అమలు చేయడంలో ఆయన ముందుంటున్నారు. నవరత్నాల పేరుతో సీఎం జగన్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో  అమలు కోసం నిరంతరం క‌ృషిచేస్తున్న సీఎం జగన్ ఒక్కరే అనిపించేలా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారంలోకి రాకముందే ప్రకటించిన విధంగా లక్షలాది ఉద్యోగాలను కల్పించారు. నెలకు రూ.5 వేలు జీతంతో గ్రామ వాలంటీర్ ఉద్యోగస్తులను నియమించుకున్నారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు సవివరంగా వివరిస్తూ.. ప్రభుత్వంపై నమ్మకాన్ని,విశ్వసనీయతను పెంచడమే వీరిపని. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో పింఛన్ల పంపిణీ, ప్రజాపంపిణీ సరుకులు, ఇంకా అనేక రకాల సేవల్ని వీరు ప్రజలకు నేరుగా ఇంటికి తీసుకెళ్లి అందించడమే వీరి పని. ఎంతో కష్టపడి పనిచేస్తున్న గ్రామ వాలంటీర్లకు ప్రస్తుతం ఇస్తున్న రూ.5 వేలను రానున్న రోజుల్లో రూ.8 వేలకుపెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం.

అయితే వైసీపీ ప్రభుత్వం నియమించిన గ్రామ వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్ష టీడీపీ ఓ రేంజ్‌లో విమర్శలు చేసింది. కేవలం రూ.5వేల రూపాయల ఉద్యోగం చేస్తున్న గ్రామ వాలంటీర్లకు పెళ్లి కూడా కాదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగంగానే విమర్శించారు. ఇళ్లల్లో మగవాళ్లు లేని సమయంలో వాలంటీర్లు ఇళ్లకు వెళ్తూ తలుపులు కొడుతున్నారని ఆరోపించారు చంద్రబాబు. లైంగిక వేధింపులకు సైతం పాల్పడుతున్నారంటూ ఆయన విమర్శించారు. ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అంతే స్ధాయిలో విమర్శలు సంధించారు. గ్రామవాలంటీర్ ఉద్యోగాలు కేవలం పార్శిల్స్ అందిందే కొరియర్ జాబ్స్ అంటూ ఎద్దేవా చేశారు. గ్రామాల్లో ఇప్పటికే ఉన్న వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఏపీ ప్రభుత్వం కొత్త ఉద్యోగాల పేరుతో వీటిని సృష్టించిందని పవన్ ఆరోపించారు. ఒక విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలకు పవన్ కళ్యాణ్ ఆరోపణలకు పెద్ద తేడా కనిపించదు.

అధికారాన్ని చేపట్టిన తొలిరోజే గ్రామ వాలంటీర్ ఉద్యోగాల కోసం సీఎం జగన్ ప్రకటించారు. అన్న మాట ప్రకారం జూన్‌లో నోటిఫికేషన్ విడుదల ఇంటర్వ్యూలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఒక లక్షా 94,592 మందిని సెలెక్ట్ చేయగా, వీరిలో ఒక లక్షా 84,944 మంది తమ ఉద్యోగాల్లో చేరారు. దీంతో తాజాగా 9,648 ఖాళీలు ఏర్పడ్డాయి. వీరికోసం మళ్లీ మరో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే ప్రభుత్వం దాదాపు రెండు లక్షల గ్రామ వాలంటీర్ ఉద్యోగాలను స‌ృష్టించి చరిత్ర సృష్టించింది. అయితే గ్రామవాలంటీర్ ఉద్యోగాల కోసం ప్రభుత్వంపై అనేక విమర్శలు సైతం వస్తున్నాయి. ఏపీలో పెద్ద ఎత్తున తీసుకున్న వాలంటీర్లు నిజానికి గ్రామ వాలంటీర్లు కాదని, వచ్చే ఎన్నికలకు ఎన్నికలకు ఇప్పటినుంచి ప్రజలను తమవైపునకు తిప్పుకోడానికే వీరిని వినియోగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనికి ప్రతిపక్షాల దగ్గర కూడా ఆధారముందు. ఆ మధ్య వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా గ్రామ వాలంటీర్ వ్యవస్థ కోసం చేసిన కామెంట్‌లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే.

జనంలో ఇప్పటినుంచే వైసీపీ ప్రభుత్వం గురించి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా వారిలో మెదళ్లకు ఎక్కించడమే వీరి పనిగా తెలుస్తుంది. అందువల్లే ప్రభుత్వం ఈ వ్యవస్థను బలంగా నమ్మినట్టుగా కనిపిస్తుంది. గ్రామీణ , అర్బన్ ప్రాంతాల్లో ఇప్పటికే అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నా.. మళ్లీ ఎందుకు వీటిని సృష్టించారు అనే సందేహాల నడుమ వీటిని కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా విపక్షాల ఆరోపణల్ని ఏమాత్రం పట్టించుకోకుండా సీఎం జగన్ గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంపొందేలా ప్లాన్ చేసినట్టుగానే విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..