సెలెక్ట్ కమిటీ అంటే ఏంటి.? తీసుకునే వ్యూహం ఇదేనా.?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు ఉత్కంఠను పెంచుతున్నాయి. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదని అధికార వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. ఫలితంగా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. విశాఖపట్నంకు పరిపాలిక రాజధాని, కర్నూలుకు జ్యూడిషియల్ రాజధాని, అమరావతిలో లెజిస్లేచర్ రాజధాని పెట్టే ప్రతిపాదన చేసింది. శాసనసభలో బిల్లును ఆమోదించింది. అంతే కాదు…సిఆర్డీఏ బిల్లు రద్దుకు ఆమోదం తెలిపి…శాసనమండలికి పంపింది. అక్కడ కూడా బిల్లులు ఆమోదం పొందితే సమస్య లేనట్లే. కానీ మూడు రాజధానులు, సిఆర్డీఏ […]

సెలెక్ట్ కమిటీ అంటే ఏంటి.? తీసుకునే వ్యూహం ఇదేనా.?
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 22, 2020 | 11:22 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు ఉత్కంఠను పెంచుతున్నాయి. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదని అధికార వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. ఫలితంగా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. విశాఖపట్నంకు పరిపాలిక రాజధాని, కర్నూలుకు జ్యూడిషియల్ రాజధాని, అమరావతిలో లెజిస్లేచర్ రాజధాని పెట్టే ప్రతిపాదన చేసింది. శాసనసభలో బిల్లును ఆమోదించింది. అంతే కాదు…సిఆర్డీఏ బిల్లు రద్దుకు ఆమోదం తెలిపి…శాసనమండలికి పంపింది. అక్కడ కూడా బిల్లులు ఆమోదం పొందితే సమస్య లేనట్లే. కానీ మూడు రాజధానులు, సిఆర్డీఏ రద్దును మొదటి నుంచి టీడీపీ వ్యతిరేకిస్తోంది. అందుకే శాసనసభలో అడ్డుకునే పని చేసింది. అయినా బిల్లు పాసైంది. ఇప్పుడు మండలిలో అడ్డుకునేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఇందుకు రూల్ నెంబర్ 71ను తీసుకువచ్చింది. శాసనమండలిలో 32 మంది సభ్యులతో అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్‌రెడ్డిలు టీడీపీకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. శమంతకమణి, శత్రుచర్లలు అసలు సభకే రాలేదు. మరో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ ముందుగానే తన పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా 27 మంది సభ్యులే టీడీపీకి మద్దతుగా నిలిచారు. దీనితో బిల్లుల పై ఓటింగ్ జరగకముందే రూల్ 71 ప్రకారం ప్రభుత్వానికి మెజార్టీ లేదని తేల్చేసింది.

రూల్ నెంబర్ 71 నిబంధనను తెరపైకి తెచ్చిన టీడీపీ… రాత్రి ‘సెలెక్ట్‌ కమిటీ’ వ్యూహాన్ని సంధించింది. మూడు రాజధానులు, సీఆర్డీయే బిల్లులపై చర్చ తర్వాత వీటిని సెలెక్ట్‌ కమిటీకి పంపాలని మండలి చైర్మన్‌ షరీఫ్ కు ఒక లేఖ అందించింది. మరోవైపు బిల్లులకు సవరణలు ప్రతిపాదించారు ఆ పార్టీ నేతలు. అమరావతి నుంచి సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు సంబంధించి 7, 8 సెక్షన్లు తొలగించాలని కోరింది. సీఆర్డీయే చట్టం ఉపసంహరణ కుదరదని ఈ సవరణల్లో ప్రతిపాదించింది. అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు సాధ్యం కాదని వాదించింది. సవరణలతో వచ్చిన బిల్లులను అసెంబ్లీ చర్చించి, తిరస్కరించి మళ్లీ శాసన మండలికి పంపాల్సి ఉంటుంది. రెండోసారి కూడా మండలి తిప్పి పంపితే ఇక దాని పాత్ర ముగిసినట్టే. శాసనసభ ఏం ఆమోదిస్తే అదే చట్టం అవుతుంది. కానీ ఇక్కడే అసలు తిరకాసు ఉంది. టీడీపీ కోరినట్లుగా ఈ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపితే ఆలస్యమవుతోంది. సెలెక్ట్ కమిటీలో శాసనసభ, శాసనమండలి సభ్యులలో ఎవరినైనా ఎంపిక చేయవచ్చు. పార్టీకి ఒకరినైనా లేక ఇద్దరినైనా తీసుకోవచ్చు. అధికార, విపక్ష కమిటీ సభ్యులు సెలెక్ట్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఎంత మంది ఉండాలి. ఏంటనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

ఆ కమిటీ ఈ బిల్లులను ముందుగా పరిశీలిస్తుంది. బిల్లు ఆమోదం పొందితే వచ్చే పరిణామాలు, కాకపోతే వచ్చే అంశాలు, బిల్లు అమలు సాధ్యా సాధ్యాలను చర్చిస్తుంది. ఆ తర్వాత కమిటీ తన నిర్ణయం తెలపాల్సి ఉంటుంది. ఈ పరిశీలనకు మూడు నెలల వరకూ సమయం ఉంటుంది. అప్పటివరకూ ఈ బిల్లుల ఆమోదం నిలిచిపోతుంది. ఈ బిల్లులను ఆధారం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయలేదు. అదే జరిగితే మూడు రాజధానుల మార్పు ఆలోచన చేస్తున్న సర్కారు వేగానికి బ్రేకులుపడతాయని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. సెలెక్ట్‌ కమిటీకి పంపడంపై మండలిలో ఓటింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. శాసనమండలిలో టీడీపీకి మెజారిటీ ఉన్నందువల్ల ఆ పార్టీ ప్రతిపాదన నెగ్గే వీలుంది.

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం
ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం
ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..