ఏపీ, తెలంగాణకు ఒకేసారి ఎన్నికలు

రానున్న పార్లమెంట్ ఎన్నికలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకేసారి నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా విజ్ఞప్తిచేశారు. ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్‌కు లేఖ రాశారు. రెండు రాష్ట్రాల్లో ఒకేరోజు ఎన్నికలు నిర్వహించడం ద్వారా క్రాస్ ఓటింగ్, డూప్లికేట్ ఓటింగ్ వంటివి నివారించవచ్చని పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికలు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాతిపదికన జరిగాయని, ఈసారి వేర్వేరు రాష్ట్రాలుగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో 25, తెలంగాణలో […]

ఏపీ, తెలంగాణకు ఒకేసారి ఎన్నికలు
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 7:31 PM

రానున్న పార్లమెంట్ ఎన్నికలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకేసారి నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా విజ్ఞప్తిచేశారు. ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్‌కు లేఖ రాశారు. రెండు రాష్ట్రాల్లో ఒకేరోజు ఎన్నికలు నిర్వహించడం ద్వారా క్రాస్ ఓటింగ్, డూప్లికేట్ ఓటింగ్ వంటివి నివారించవచ్చని పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికలు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాతిపదికన జరిగాయని, ఈసారి వేర్వేరు రాష్ట్రాలుగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో 25, తెలంగాణలో 17 ఎంపీ సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికీ రెండు రాష్ట్రాలకు చెందినవారు చాలా మంది హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారని వెల్లడించారు. ఏపీకి చెందినవారిలో చాలామంది తెలంగాణలో సైతం ఓటుహక్కు కలిగిఉన్నారన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పార్లమెంట్ ఎన్నికలను నిర్వహించడం ద్వారా ప్రలోభాలకు తావులేకుండా చేయడంతోపాటు డూప్లికేట్ ఓట్లు, బోగస్ ఓట్లు, డబుల్ ఓట్లు వంటివాటిని నివారించవచ్చని పేర్కొన్నారు.