ఎన్నికల కమిషనర్‌కు ఉద్యోగులు సహకరించరని పెద్దిరెడ్డి మంత్రి మాట్లాడ్డం రాజ్యాంగ విరుద్ధం : అచ్చెన్నాయుడు

ప్రజాబలం వైసీపీకు వుంటే ఒక్క నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ఎందుకు భయపడుతున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జగన్ సర్కారుని..

ఎన్నికల కమిషనర్‌కు ఉద్యోగులు సహకరించరని పెద్దిరెడ్డి మంత్రి మాట్లాడ్డం రాజ్యాంగ విరుద్ధం : అచ్చెన్నాయుడు
Follow us

|

Updated on: Jan 23, 2021 | 2:50 PM

ప్రజాబలం వైసీపీకు వుంటే ఒక్క నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ఎందుకు భయపడుతున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జగన్ సర్కారుని ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్‌కు ఉద్యోగులు సహకరించరని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. “ఉద్యోగుల జీతాల్లో కోత కోశారు.. డీఏ బకాయిలు చెల్లించలేదు.. పీఆర్‌సీ ఇవ్వలేదు.. సీపీయస్‌ రద్దు చేయలేదు.” అని అచ్చెన్న చెప్పుకొచ్చారు. వైసీపీ ఉద్యోగ వ్యతిరేక విధానాల వైరస్‌ ముందు, కరోనా వైరస్‌ ప్రభావం ఎంతని ఆయన అన్నారు. “కరోనా వ్యాక్సిన్‌ కుంటి సాకు మాత్రమే. స్వేచ్ఛాయుత ఎన్నికలంటే వైకాపాకు జ్వరం పట్టుకొన్నట్టుగా ఉంది.. రాజ్యాంగాన్ని, న్యాయస్థానాల తీర్పుల్ని ధిక్కరించే వారిపై ఎన్నికల కమిషన్‌, గవర్నర్‌ చర్యలు తీసుకుని రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించాలి.” అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. స్వేచ్ఛాయుత ఎన్నికలంటే మంత్రి పెద్దిరెడ్డికి ఎందుకు భయమన్న అచ్చెన్నాయుడు, ఏపీలో స్వేచ్ఛగా పంచాయతీ ఎన్నికలు జరిగితే వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారనే భయంతోనే తమ తోలుబొమ్మ కనకరాజన్‌ను తెచ్చారని అచ్చెన్నాయుడు విమర్శించారు.