ఏపీలో గందరగోళంగా ఇంటర్మీడియట్‌ అడ్మిషన్ల వ్యవహారం

ఏపీలో ఇంటర్మీడియట్‌ అడ్మిషన్ల వ్యవహారం గందరగోళంగా మారింది. వెబ్‌సైట్‌లో ప్రైవేట్‌ కాలేజీల జాబితా కనిపించకపోవడంతో విద్యార్థులు తాము కోరుకున్న కాలేజీలో సీటు పొందలేకపోతున్నారు. ఇలాఉంటే, కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ విధానం వేలాది మంది జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలకు సైతం కొత్త కష్టాలు తీసుకొచ్చింది. ఒకవైపు నేటితో ఆన్‌లైన్‌లో అడ్మిషన్ల గడువు ముగుస్తుండటంతో జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ఫీజుల విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అన్ని కాలేజీలకు ఒకే విధమైన ఫీజు ఉండేలా ప్రభుత్వం నిర్థారించడంతో […]

ఏపీలో గందరగోళంగా ఇంటర్మీడియట్‌ అడ్మిషన్ల వ్యవహారం
Follow us

|

Updated on: Oct 29, 2020 | 11:42 AM

ఏపీలో ఇంటర్మీడియట్‌ అడ్మిషన్ల వ్యవహారం గందరగోళంగా మారింది. వెబ్‌సైట్‌లో ప్రైవేట్‌ కాలేజీల జాబితా కనిపించకపోవడంతో విద్యార్థులు తాము కోరుకున్న కాలేజీలో సీటు పొందలేకపోతున్నారు. ఇలాఉంటే, కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌లైన్‌ విధానం వేలాది మంది జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలకు సైతం కొత్త కష్టాలు తీసుకొచ్చింది. ఒకవైపు నేటితో ఆన్‌లైన్‌లో అడ్మిషన్ల గడువు ముగుస్తుండటంతో జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ఫీజుల విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అన్ని కాలేజీలకు ఒకే విధమైన ఫీజు ఉండేలా ప్రభుత్వం నిర్థారించడంతో ఇప్పటి వరకు ప్రైవేట్‌, కార్పొరేట్‌ కాలేజీల ఇన్‌టేక్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంటర్‌ బోర్డుకు ఇవ్వకపోవడంతో ఆన్‌లైన్‌లో ఆయా కాలేజీలకు స్థానం లేకుండాపోయింది. ఇంటర్మీడియట్‌ బోర్డు నిబంధనల ప్రకారం భవనాలు 8 వేల అడుగుల విస్తీర్ణం, ఫైర్‌సేఫ్టీతో పాటు పార్కింగ్‌ సౌకర్యం లాంటి వసతులు ఉండాలి. అయితే పలు రకాల సర్టిఫికేట్లు లేక అఫిలియేషన్‌ తిరస్కరణతో చాలా ప్రైవేట్‌ కాలేజీలు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. మరోవైపు ట్యూషన్‌ ఫీజు మాత్రమే వసూలు చేయాలనే నిబంధన అమల్లో ఉండటంతో చాలా కాలేజీలు ఇన్‌టేక్ సమాచారాన్ని ఇంటర్‌బోర్డుకు సమర్పించలేదు. దీంతో విద్యార్థులు చేరాలనుకున్న కాలేజీలు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. ముఖ్యంగా శ్రీచైతన్య, నారాయణ లాంటి విద్యాసంస్థలకు చెందిన కాలేజీల్లో అడ్మిషన్లకు అవకాశం లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనలకు గురవుతున్నారు. మరోవైపు అడ్మిషన్లలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించాల్సి ఉండటంతో వేలాది మంది విద్యార్థులు అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌ విధానంలో చేపట్టిన అడ్మిషన్లలో ఇబ్బందులున్న మాట వాస్తవమే అంటున్నారు ఇంటర్‌బోర్డు అధికారులు. ఆన్‌లైన్‌లో లేని కాలేజీల్లో అడ్మిషన్లను గుర్తించబోమంటున్నారు. అన్ని సౌకర్యాలు, వసతులు ఉన్న కాలేజీలను జియో ట్యాగింగ్‌ చేశామంటున్నారు.