ఆ విషయంలో రెండో స్థానానికి చేరిన ఆంధ్రా

కోవిడ్ కట్టడిలో నిమగ్నమైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అనుకోకుండా ఓ స్టెప్ అధిగమించింది. దేశంలో అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న రెండో రాష్ట్రంగా నిలిచింది.

ఆ విషయంలో రెండో స్థానానికి చేరిన ఆంధ్రా
Follow us

|

Updated on: Apr 19, 2020 | 7:00 PM

కోవిడ్ కట్టడిలో నిమగ్నమైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అనుకోకుండా ఓ స్టెప్ అధిగమించింది. దేశంలో అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న రెండో రాష్ట్రంగా నిలిచింది. సీఎం జగన్ నివాసంలో ఆదివారం కోవిడ్‌ –19 నియంత్రణ చర్యలపై సమీక్ష జరిగింది. లాక్ డౌన్ అమలు పై కూడా ముఖ్యమంత్రి చర్చలు జరిపారు.

శనివారం (18/04/2020) ఒక్కరోజే ఏపీలో 5508 టెస్టులు నిర్వహించామని అధికారులు సీఎంకు వివరించారు. జనాభా ప్రాతిపదికన ప్రతి 10 లక్షల మందికి అత్యధిక టెస్టులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో 2వ స్థానానికి ఏపీ చేరుకుందని తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రం రోజుకి 685 పరీక్షలు చేస్తుండగా, 539 పరీక్షలతో రెండో స్థానంలో ఏపీ కొనసాగుతుందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. ఈ సంఖ్య ర్యాపిడ్‌ కిట్స్‌ వినియోగించకుండా జరిపిన టెస్టుల సంఖ్య అని వారన్నారు.

మరో 3–4 రోజుల్లో టెస్టుల సంఖ్య బాగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. వారం రోజుల్లో..  రోజుకు 17,500కు పైగా టెస్టులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి చేరుకున్న ర్యాండమ్‌ కిట్లను 2 రోజుల్లో వినియోగించడం ప్రారంభిస్తామని సీఎంకు తెలిపారు అధికారులు. రెడ్‌జోన్స్‌లో ర్యాండమ్‌ సర్వే చేయడంతోపాటు, కుటుంబ సర్వేద్వారా గుర్తించిన వారిని కూడా పరీక్షించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

కుటుంబ సర్వేలద్వారా గుర్తించిన 32వేల మందికి పరీక్షలు జరుపుతామని అన్నారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు. కరోనా బీమా కిందకు వాలంటీర్లు, ఆశావర్కర్లు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులతోపాటు ఫ్రంట్‌ లైన్లో ఉన్నవారిని చేర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టాలని, ప్రతి 2–3 రోజులకోసారి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని సీఎం నిర్దేశించారు. మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు తయారుచేసిన మాస్కులను సీఎం పరిశీలించారు. వాటిని రెడ్‌జోన్లకురెడ్‌జోన్లకు ముందస్తుగా పంపిణీచేస్తున్నామని అధికారులు తెలుపగా, ప్రతి మనిషికి 3 చొప్పున మాస్కులు పంపిణీ చేయాలని సీఎం సూచించారు.

మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..