Breaking News
  • విశాఖలో లైట్‌మెట్రోకు డీపీఆర్‌లు రూపొందించాలని ఆదేశాలు. ఏఎంఆర్సీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ. 79.91 కిలోమీటర్ల మేర లైట్‌మెట్రోకు ప్రతిపాదనలు. డీఎంఆర్సీ, రైట్స్, యూఎంటీసీ నుంచి సలహాలు తీసుకోవాలని ఆదేశం. 60.2 కి.మీ. మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్స్ ఏర్పాటుకు డీపీఆర్‌లు. డీఎంఆర్సీ, రైట్స్, యూఎంటీసీల నుంచి డీపీఆర్‌లు ఆహ్వానించాలని ఆదేశం.
  • నిర్భయ దోషులను విడివిడిగా ఉరితీయాలంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ. ఇప్పటికే తీర్పును రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం. రేపు తీర్పు ఇవ్వనున్న జస్టిస్‌ భానుమతి నేతృత్వంలోని.. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 5 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.67 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 46,448 మంది భక్తులు.
  • విశాఖ: పాయకరావుపేటలో హెటిరో ఉద్యోగి ఒంటెద్దు రాజు ఉరి వేసుకుని ఆత్మహత్య, మృతుడు తూ.గో.జిల్లా పెదపట్నం లంక వాసి.
  • ఢిల్లీ చేరుకున్న ట్రంప్‌ దంపతులు. ఎయిర్‌పోర్ట్‌లో ట్రంప్‌ దంపతులకు ఘనస్వాగతం. ఐటీసీ మౌర్య హోటల్‌లో ట్రంప్‌ దంపతుల బస. ఢిల్లీలో భారీగా భద్రతా ఏర్పాట్లు. ట్రంప్‌ బస చేసిన హోటల్‌ దగ్గర పటిష్ట భద్రత.

విశాఖలోనే రాజధాని..ఎవరూ ఆపలేరుః తమ్మినేని

Andhra Pradesh Speaker Tammineni Sitaram, విశాఖలోనే రాజధాని..ఎవరూ ఆపలేరుః తమ్మినేని
ఎవరెన్ని ఆటంకాలు కలిగించినా, ఉద్యమాలు చేసినా విశాఖలోనే రాజధాని వచ్చి తీరుతుందని ఖరాఖండిగా చెప్పారు ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని తీర్చే నాయకుడి కోసం కలలు కన్నామని, అటువంటి నాయకుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి రూపంలో రావటం ఉత్తరాంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నారు. మూడు రాజధానులు, నాలుగు ప్రాంతాయ మండళ్ల ఏర్పాటుకు జగన్‌ గొప్ప ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో వైఎస్‌ జగన్‌ నాయకత్వాన్ని వదులుకుంటే ఉత్తరాంధ్ర వాసులంతా అజ్ఞానులు మరొకరు ఉండరని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాయకుడంటే దమ్మున్నోడు..నాయకుడంటే గుండెబలమున్నాడో..అలాంటి నాయకుడే మన ముఖ్యమంత్రి అంటూ ప్రశంసించారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తుంటే ఉద్యమాలెందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నా ఇన్‌సైడ్‌ ట్రేడింగ్ పడిపోయిందనా, లేక మీరు కొన్న భూముల ధరలు భూంఫట్‌ అయ్యాయని చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతోందన్నారు. అమరావతిలో ఉద్యమాలు చేసేదంతా భూములు కొట్టేసినోళ్లు, పచ్చచొక్కావాళ్లే అని ఎద్దేవా చేశారు.
విశాఖకు, పాలనా రాజధాని, కర్నూలులో హైకోర్టు కావాలంటున్నారా.వద్దంటున్నారా అని ప్రతిపక్ష నేతలను ప్రశ్నించారు. అమరావతిలో లెజిస్లేచర్‌ రాజధాని ఉండాలంటారా..? వద్దంటారా..? అన్నదానిపై మాజీ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం చేస్తుంటే, ఉద్యమాలు చేస్తున్నారా, అభివృద్ధి కోసం పనిచేస్తుంటే.., మీకు ఇంకా బుద్దిరాలేదా అని విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా బ్రహ్మదేవుడు ఉద్యమాలు చేసేవారికి బుద్ధిని ప్రసాధించాలని కోరుకుంటున్నానని అన్నారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం.

Related Tags