ఏపీ సర్కార్ సలహాదారుపై వేటు..

ఏపీ సర్కార్ పని చేయని అధికారిపై కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారు హెచ్‌కే సాహును విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఏపీ సర్కార్ సలహాదారుపై వేటు..
Follow us

|

Updated on: May 15, 2020 | 1:00 PM

ఏపీ సర్కార్ పని చేయని అధికారిపై కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారు హెచ్‌కే సాహును విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో ప్రాజెక్టు సాంకేతిక, న్యాయ సలహాదారుగా సాహును.. ఏప్రిల్‌ 14, 2018న కన్సల్టెంట్‌గా ఏపీ ప్రభుత్వం నియమించింది. అయితే ఆయన పనితీరు సంతృప్తికరంగా లేదని ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు సీఈ నివేదిక పంపారు. దీంతో కన్సల్టెంట్‌గా సాహును తొలగించే ప్రతిపాదనలపై ప్రభుత్వం ఆమోదించింది.