నేడు తెలంగాణకు సచివాలయం అప్పగింత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పెండింగ్‌లో ఉన్న భవనాల అప్పగింత కార్యక్రమం ఇవాళ జరగబోతోంది. రాష్ట్ర విభజన తర్వాత  కొన్ని భవనాలను ఏపీకి కేటాయించిన సంగతి తెలిసిందే.  ఆ భవనాల్ని తిరిగి ఏపీ అధికారులు ఇవాళ తెలంగాణ అధికారులకు అప్పగిస్తారు. సచివాలయంలోని కొన్ని బ్లాకులు, ఏపీ డీజీపీ కార్యాలయ భవనం, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లను ఇచ్చేస్తారు. ఫలితంగా సచివాలయం మొత్తం తెలంగాణ సొంతమవుతుంది. అందువల్ల ఈ నెల 27న కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శంకుస్థాపన చేస్తుంది. కాళేశ్వరం […]

నేడు తెలంగాణకు సచివాలయం అప్పగింత
Follow us

|

Updated on: Jun 17, 2019 | 11:07 AM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పెండింగ్‌లో ఉన్న భవనాల అప్పగింత కార్యక్రమం ఇవాళ జరగబోతోంది. రాష్ట్ర విభజన తర్వాత  కొన్ని భవనాలను ఏపీకి కేటాయించిన సంగతి తెలిసిందే.  ఆ భవనాల్ని తిరిగి ఏపీ అధికారులు ఇవాళ తెలంగాణ అధికారులకు అప్పగిస్తారు. సచివాలయంలోని కొన్ని బ్లాకులు, ఏపీ డీజీపీ కార్యాలయ భవనం, లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లను ఇచ్చేస్తారు. ఫలితంగా సచివాలయం మొత్తం తెలంగాణ సొంతమవుతుంది. అందువల్ల ఈ నెల 27న కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శంకుస్థాపన చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్‌ను ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్ ఇవాళ విజయవాడ వెళ్తున్నారు. అప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై చిన్నపాటి చర్చ జరిగే అవకాశం ఉంది.