బాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్.. ముడుపులు తీసుకుంటున్నట్లు..!

ఏపీ అసెంబ్లీ చివరి రోజు హాట్‌ హాట్‌గా జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ రోజు ఉపాధి హామీ నిధుల బకాయిలపై వాడివేడి చర్చ సాగుతోంది. కేంద్రం విడుదల చేసిన నిధులను ప్రభుత్వం పక్క దారి పట్టించిందని వైసీపీపై తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసింది. టీడీపీ ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవికి అలాగే ఎమ్యెల్యేగా కూడా రాజీనామా చేస్తానని మంత్రి పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. మంత్రి సభను తప్పుదోవ పట్టించారని.. పోడియం వద్దకు దూసుకెళ్లారు టీడీపీ సభ్యులు. తమకు […]

బాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్.. ముడుపులు తీసుకుంటున్నట్లు..!
Follow us

| Edited By:

Updated on: Dec 17, 2019 | 11:31 AM

ఏపీ అసెంబ్లీ చివరి రోజు హాట్‌ హాట్‌గా జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ రోజు ఉపాధి హామీ నిధుల బకాయిలపై వాడివేడి చర్చ సాగుతోంది. కేంద్రం విడుదల చేసిన నిధులను ప్రభుత్వం పక్క దారి పట్టించిందని వైసీపీపై తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసింది. టీడీపీ ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవికి అలాగే ఎమ్యెల్యేగా కూడా రాజీనామా చేస్తానని మంత్రి పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. మంత్రి సభను తప్పుదోవ పట్టించారని.. పోడియం వద్దకు దూసుకెళ్లారు టీడీపీ సభ్యులు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ పోడియం వద్ద నిరసన చేపట్టిన టీడీపీ సభ్యులు. స్పీకర్ సమాధానం ఇవ్వకపోవడంతో.. సభ నుంచి వాకౌట్ చేసిన టీడీపీ.