రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తున్నాం.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి తిరుపతిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రైతుల నుంచి రాజధానికి తీసుకున్న 33 వేల ఎకరాలను తిరిగి ఇచ్చేస్తున్నామన్నారు. రాజధాని భూములు వెనక్కి ఇస్తామని ఎన్నికలకు ముందే జగన్ ప్రకటించారని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. రాజధానిని తరలించొద్దంటూ రోడ్డుపై ధర్నాలు చేసేవారంతా టీడీపీ కార్యకర్తలేనని, లెజిస్లేటివ్ క్యాపిటల్‌కు 300 ఎకరాలు ఉంటే సరిపోతుందన్నారు. ఏపీకి మూడు రాజధానులు కాకపోతే.. 30 పెట్టుకుంటామని సెటైరికల్ కామెంట్స్ చేశారు. రాజధానులతో కేంద్రానికి […]

రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తున్నాం.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Dec 20, 2019 | 9:07 AM

వైసీపీ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి తిరుపతిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రైతుల నుంచి రాజధానికి తీసుకున్న 33 వేల ఎకరాలను తిరిగి ఇచ్చేస్తున్నామన్నారు. రాజధాని భూములు వెనక్కి ఇస్తామని ఎన్నికలకు ముందే జగన్ ప్రకటించారని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. రాజధానిని తరలించొద్దంటూ రోడ్డుపై ధర్నాలు చేసేవారంతా టీడీపీ కార్యకర్తలేనని, లెజిస్లేటివ్ క్యాపిటల్‌కు 300 ఎకరాలు ఉంటే సరిపోతుందన్నారు. ఏపీకి మూడు రాజధానులు కాకపోతే.. 30 పెట్టుకుంటామని సెటైరికల్ కామెంట్స్ చేశారు. రాజధానులతో కేంద్రానికి సంబంధం ఉండదు. ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై విచారణ కొనసాగుతుందని అన్నారు.

కాగా.. విశాఖలో వైసీపీ నేతలు భూములు కొంటున్నారన్నది అవాస్తవమని.. ఇప్పటికే ఇక్కడ భూములు రేట్లు ఆకాశనంటుతున్నాయని, ఇప్పుడు భూములు కొనడం సాధ్యం కాదన్నారు. తుళ్లూరులో తక్కువ ధరలకే టీడీపీ నేతలు భూములు కాజేశారని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గత కొద్దిరోజులుగా ఏపీ రాజధాని విషయంపై జరుగుతోన్న రగడ తెలిసిందే. సీఎం జగన్ రాజధాని విషయంపై చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారే రేపుతోంది. అమరావతి వ్యాప్తంగా రైతులు ఆందోళనలను ఉధృతం చేశారు. పైగా.. ఇప్పుడు మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసినట్టైంది చూడాలి మరి.. రాజధానిపై ఇంకేం వివాదాలు పుట్టుకొస్తాయో.