స్కిల్ కాలేజీల ఏర్పాట్లపై మంత్రి మేకపాటి సమీక్ష

డిసెంబర్‌లో నైపుణ్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేస్తామని ఏపీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. 20 స్కిల్ కాలేజీలకు భూ కేటాయింపుల ప్రక్రియ పూర్తి అయిందని ఆయన తెలిపారు. అమరావతిలో మేకపాటి అధ్యక్షతన నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖపై సమీక్షా సమావేశం జరిగింది. స్కిల్ కాలేజీలు, యూనివర్శీటీల ఏర్పాటు పనులపై ఈ సందర్భంగా చర్చించారు. మరో 5 కాలేజీలకు భూ కేటాయింపులు.. ప్రస్తుత పరిస్థితిపైనా మంత్రి ఆరాతీశారు. తొలుత పరిపాలన విభాగం నుంచి అనుమతులకు యత్నించాలని మంత్రి […]

  • Venkata Narayana
  • Publish Date - 3:13 pm, Mon, 19 October 20

డిసెంబర్‌లో నైపుణ్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేస్తామని ఏపీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. 20 స్కిల్ కాలేజీలకు భూ కేటాయింపుల ప్రక్రియ పూర్తి అయిందని ఆయన తెలిపారు. అమరావతిలో మేకపాటి అధ్యక్షతన నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖపై సమీక్షా సమావేశం జరిగింది. స్కిల్ కాలేజీలు, యూనివర్శీటీల ఏర్పాటు పనులపై ఈ సందర్భంగా చర్చించారు. మరో 5 కాలేజీలకు భూ కేటాయింపులు.. ప్రస్తుత పరిస్థితిపైనా మంత్రి ఆరాతీశారు. తొలుత పరిపాలన విభాగం నుంచి అనుమతులకు యత్నించాలని మంత్రి సూచించారు. తిరుపతిలో స్కిల్ యూనివర్శిటీ, విశాఖపట్నం, చిత్తూరు, ఏలూరు, నెల్లూరు, కడప జిల్లాలో స్కిల్ కాలేజీల ప్రారంభానికి సమాలోచనలు చేశారు. నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన నిధుల సమీకరణపైనా ఈ సందర్భంలో చర్చ జరిగింది. నవంబర్ 15 నాటికి సమగ్ర పరిశ్రమ సర్వే పూర్తి చేయాలని మంత్రి ఈ సందర్భంగా ఆదేశాలిచ్చారు. ఇప్పటి వరకూ 13 జిల్లాలలో జరుగుతున్న సమగ్ర పరిశ్రమల సర్వే తీరుపైనా మంత్రి సమీక్షించారు.