సిహెచ్‌సిలో మంత్రి కృష్ణదాస్ ఆకస్మిక తనిఖీలు

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని సిహెచ్ సిని మంత్రి ధర్మాన కృష్ణ దాస్ ఆకస్మిక తనిఖీలు చేశారు. మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెనాయుడు స్వగృహంలోని బీసీ బాలుర వసతి గృహంలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. బాలుర హాస్టల్‌లో అణువణువూ పరిశీలించి సదుపాయాల కల్పన పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు. 498 మంది విద్యార్థులు ఉండాల్సి వుండగా రికార్డుల్లో 78 మంది విద్యార్థుల పేర్లు మాత్రమే ఉండటంతో మంత్రి షాక్ అయ్యారు. సమయానికి […]

సిహెచ్‌సిలో మంత్రి కృష్ణదాస్ ఆకస్మిక తనిఖీలు
Follow us

| Edited By:

Updated on: Jun 29, 2019 | 8:36 AM

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని సిహెచ్ సిని మంత్రి ధర్మాన కృష్ణ దాస్ ఆకస్మిక తనిఖీలు చేశారు. మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెనాయుడు స్వగృహంలోని బీసీ బాలుర వసతి గృహంలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. బాలుర హాస్టల్‌లో అణువణువూ పరిశీలించి సదుపాయాల కల్పన పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు. 498 మంది విద్యార్థులు ఉండాల్సి వుండగా రికార్డుల్లో 78 మంది విద్యార్థుల పేర్లు మాత్రమే ఉండటంతో మంత్రి షాక్ అయ్యారు. సమయానికి వార్డెన్, కుక్, వాచ్ మెన్ లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇలాగే పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.