బిసిల కోసం టిడిపి చేసిన ఒక్కపని చెప్పండి : బొత్స

బిసిల కోసం టిడిపి చేసిన పని ఒక్కటి చెప్పాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు టీడీపీకి లేదన్నారు. బిసిలకు ఆదరణ పథకం పేరుతో అదే పని చేసుకోవాలని చంద్రబాబు చెప్పారని బొత్స విమర్శించారు. పని ముట్లు కూడా అధిక ధరలకు కొనుగోలు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని ఆరోపించారు. బిసిల సంక్షేమం కోసం జగన్ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని ఇది ఒక చారిత్రక నిర్ణయమని బొత్స పేర్కొన్నారు.

  • Venkata Narayana
  • Publish Date - 2:39 pm, Sun, 18 October 20