వోక్స్ వ్యాగన్ కేసులో.. సీబీఐ కోర్టుకు మంత్రి బొత్స

వోక్స్ వ్యాగన్ కుంభకోణం కేసులో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. జర్మనీకి చెందిన వోక్స్ వ్యాగన్ కోసం వశిష్టవాహన్ అనే సంస్థకు 11 కోట్ల రూపాయలు చెల్లించిన కుంభకోణం కేసులో బొత్స సత్యనారాయణ సాక్షిగా ఉన్నారు. కాగా, ఈ కేసులో నలుగురిపై సీబీఐ అభియోగాలు మోపింది. జైన్, అళగ రాజా, గాయత్రి, వశిష్టవాహన్ సీఈవో సూష్టర్‌లపై కేసులు నమోదు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఈ […]

వోక్స్ వ్యాగన్ కేసులో.. సీబీఐ కోర్టుకు మంత్రి బొత్స
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 24, 2019 | 2:29 PM

వోక్స్ వ్యాగన్ కుంభకోణం కేసులో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. జర్మనీకి చెందిన వోక్స్ వ్యాగన్ కోసం వశిష్టవాహన్ అనే సంస్థకు 11 కోట్ల రూపాయలు చెల్లించిన కుంభకోణం కేసులో బొత్స సత్యనారాయణ సాక్షిగా ఉన్నారు. కాగా, ఈ కేసులో నలుగురిపై సీబీఐ అభియోగాలు మోపింది. జైన్, అళగ రాజా, గాయత్రి, వశిష్టవాహన్ సీఈవో సూష్టర్‌లపై కేసులు నమోదు చేసింది.

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఈ వివాదం రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపింది. విశాఖకు చెందిన కార్ల ఫ్యాక్టరీ స్థాపనకు వోక్స్ వ్యాగన్‌కు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వశిష్ట వాహన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ. 11 కోట్లు చెల్లించింది. అయితే వశిష్ట వాహన్ సీఈవో సూష్టర్‌తో తమకు ఏ విధమైన సంబంధం లేదని వోక్స్ వ్యాగన్ ప్రకటించింది. దీంతో అప్పట్లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ పై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును సీబీఐకి అప్పగించడంతో.. 2005లో వోక్స్ వ్యాగన్ కుంభకోణం పై సీబీఐ కేసు నమోదు చేసింది. మొత్తం 3 వేల పేజీలలో ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి 59 మంది సాక్షులను సీబీఐ అధికారులు విచారించారు. మొత్తం రూ. 12 కోట్లు కుంభకోణం జరిగినట్లు తన నివేదికలో వెల్లడించింది. కాగా ఇప్పటివరకూ రూ. 7 కోట్లు సీబీఐ అధికారులు రికవరీ చేశారు. మిగిలిన వాటి కోసం విచారణ చేపడుతున్నారు.