ఏపీ మంత్రి బాలినేని పాదయాత్ర

ఏపీ విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఒంగోలులో చేపట్టిన పాదయాత్రకు జనం భారీగా తరలివచ్చారు. ఎన్నికల ముందు వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేసి ఇప్పటికి మూడేళ్ళు పూర్తయిన సందర్భంగా వైసీపీ శ్రేణులు చేపట్టిన పాదయాత్రలో మంత్రి బాలినేని పాల్గొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో బాలినేని కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశారు. తొలుత కర్నూలు రోడ్డులోని వైయస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సియం వైయస్‌ జగన్‌ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పధకాలను అడ్డుకునేందుకు […]

  • Venkata Narayana
  • Publish Date - 2:58 pm, Wed, 11 November 20
ఏపీ మంత్రి బాలినేని పాదయాత్ర

ఏపీ విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఒంగోలులో చేపట్టిన పాదయాత్రకు జనం భారీగా తరలివచ్చారు. ఎన్నికల ముందు వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేసి ఇప్పటికి మూడేళ్ళు పూర్తయిన సందర్భంగా వైసీపీ శ్రేణులు చేపట్టిన పాదయాత్రలో మంత్రి బాలినేని పాల్గొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో బాలినేని కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశారు. తొలుత కర్నూలు రోడ్డులోని వైయస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సియం వైయస్‌ జగన్‌ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పధకాలను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి బాలినేని విమర్శించారు. ఒంగోలులో 24 వేల మంది నిరుపేదలకు ఇళ్ళపట్టాలు ఇచ్చేందుకు భూమి సిద్దం చేశామని, అయితే అక్కడ ఐరన్‌ ఓర్‌ మైనింగ్‌ ఉందంటూ టిడిపి నేతలు కోర్టుకు వెళ్ళారన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్న టీడీపీ నేతల వైఖరిపట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోందన్నారు.