Breaking News
  • కర్నూలు: ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్వాకం. మహిళకు ఆపరేషన్‌ చేసి కడుపులో దూదిని మర్చిపోయిన డాక్టర్లు. డాక్టర్ల తీరుపై బాధిత బంధువుల ఆందోళన.
  • హైదరాబాద్‌: ఇందిరాపార్క్‌ దగ్గర ఎమ్మార్పీఎస్‌ మహాదీక్ష. ఎమ్మార్పీఎస్‌ మహాదీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ. నాచారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మందకృష్ణ అరెస్ట్‌. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా దీక్షకు పిలుపునిచ్చిన ఎమ్మార్పీఎస్‌.
  • వనపర్తి: పెబ్బేరు బైపాస్‌లో ఆటోను ఢీకొన్న కారు. ఒకరు మృతి, మరో ముగ్గురికి గాయాలు. ఒకరి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • తూ.గో: కాకినాడలో అధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష. విషజ్వరాలు అధికంగా ఉన్న చోట స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలి. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు చేపట్టాలి. ప్రైమరీ స్కూళ్లలో టీచర్ల కొరతను త్వరలో పరిష్కరిస్తాం. తూ.గో.జిల్లాలో రూ.250 కోట్లతో మంచినీటి పథకం అమలుచేస్తాం. అర్హులందరికీ త్వరలో ఇళ్ల స్థలాల పట్టాలు అందిస్తాం-మంత్రి కన్నబాబు.
  • హైదరాబాద్‌: ఇందిరాపార్క్‌ దగ్గర ఎమ్మార్పీఎస్‌ మహాదీక్ష. ఎమ్మార్పీఎస్‌ మహాదీక్షకు పోలీసుల అనుమతి నిరాకరణ. నాచారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మందకృష్ణ అరెస్ట్‌. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా దీక్షకు పిలుపునిచ్చిన ఎమ్మార్పీఎస్‌.
  • కరీంనగర్‌: కలెక్టర్‌ ఆడియో టేపుల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌. వివరాలు సేకరిస్తున్న సీఎంఓ అధికారులు. ఇప్పటికే ప్రభుత్వానికి వివరణ ఇచ్చిన కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌.
  • ఉత్తరాఖండ్: సాయంత్రం బద్రీనాథ్‌ ఆలయం మూసివేత. చివరిరోజు కావడంతో భారీగా దర్శించుకుంటున్న భక్తులు.

ఆయనను మనిషిగా కూడా చూడను: గంటాకు అవంతి కౌంటర్

Avanthi Vs Ganta

మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుపై మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నోరు తెరిస్తే గంటా బండారం బయటపడుతుందని ఆయన ఫైర్ అయ్యారు. గంటాను తాను కనీసం మనిషిగా కూడా గుర్తించనని అన్నారు. అన్నం పెట్టిన వారికి గంటా సున్నం పెడతారని విమర్శించారు. రాజకీయాల్లోకి తీసుకొచ్చిన అయ్యన్నకే గంటా శ్రీనివాసరావు సున్నం పెట్టారని.. ఆయన ఇంకా మంత్రిగానే ఉన్నట్లు భ్రమ పడుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. తనకు కూడా గంటా సున్నం పుయ్యాలని చూశారని.. అయితే తాను పూయించుకోలేదని పేర్కొన్నారు. అదృష్టం బాగుండి గంటా స్వల్ప మెజార్టీతో గెలిచారని చెప్పుకొచ్చారు. మంచివారిని వైసీపీ చేర్చుకుంటుందని, కబ్జాదారులను కాదు అంటూ అవంతి వ్యాఖ్యలు చేశారు.

అయితే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారన్న వార్తలు ఇటీవల గుప్పుమన్నాయి. ఈ క్రమంలో ఆ మధ్యన గంటాపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి అవంతి. వాటిపై తాజాగా మాట్లాడిన గంటా.. తాను అవంతిని మంత్రిగా చూడటం లేదని.. వైసీపీలోకి వెళ్లాలనుకుంటే ఎవరూ ఆపలేరని.. పార్టీ మారాలనుకుంటే అందరితో చర్చించి వెళ్లానని.. చాటు మాటు వ్యవహారాలు చేయనని అన్నారు. ఎవరో తనను రెచ్చగొట్టాలని చూస్తే ఆ ట్రాప్‌లో తాను పడనని గంటా చెప్పుకొచ్చారు. ఇక ఈ వ్యాఖ్యలకు మరోసారి కౌంటర్ ఇచ్చారు అవంతి. తాను గంటాను మనిషిగా కూడా చూడనంటూ చెప్పుకొచ్చారు. కాగా.. గత కొన్ని రోజులుగా ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే.